Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఉల్లిపాయ పులుసు,ఒక్కసారి తింటే సాంబార్‌ని మర్చిపోతారు, ఎలా చేసుకోవాలో తెలుసా?
చాలా మందికి సాంబార్ లేదా పచ్చి పులుసు ఇష్టం ఉంటుంది. అవి లేకుండా ముద్ద కూడా తినని వాళ్ళు చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా శాఖాహార ప్రియులకు ఇది ఎంతో ఇష్టమైన వంటకం. అలాంటి పులుసులో ఉల్లిపాయ పులుసు ఒకటి. ఇది చాలా ప్రాచీనమైన వంటకం. అలాగే ఎంతో మందికి ఇష్టమైనది కూడా. ఇది సులభంగా తయారైపోయే ఒక ప్రాచీన వంటకం. దీనిని ఎలా తయారు చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉల్లిపాయ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు:
చిన్న ఉల్లిపాయలు - 15
చింతపండు - చిన్న నిమ్మపండు సైజు అంత
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1/2 టీస్పూన్
మెంతులు - 1/4 టీస్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
ఎండుమిర్చి - 4
పసుపు - 1/4 టీస్పూన్
కారం - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
బెల్లం - చిన్న ముక్క

ఉల్లిపాయ పులుసు తయారీ విధానం:
- ముందుగా చింతపండును నానబెట్టి పులుసు తీసుకోండి.
- చిన్న ఉల్లిపాయలను పొట్టు తీసి సగానికి కట్ చేసుకోండి.
- స్టవ్ మీద ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించండి.
- ఆ తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
- అనంతరం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాసేపు వేయించండి.
- తరువాత చింతపండు పులుసు, ఉప్పు, బెల్లం వేసి బాగా కలపండి.
- పులుసు చిక్కబడే వరకు ఉడకనివ్వండి.
- రుచి చూసుకుని, దించుకొని వేడి వేడి అన్నంలో వడ్డించుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పులుసు సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications