Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్ట్రీట్ స్టైల్ ఉల్లిపాయ సమోసాను చేసుకుందామా..?
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ సమోసాను ఇష్టపడనివారెవు. దేశమంతటా ఏ గల్లీలో చూసినా సమోసా సెంటర్లు మనకు కనిపిస్తాయ్. ఇక రాజస్థానీ సమోసాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రిస్పీ సమోసాలు రింత రుచిగా వుంటాయ్. ఈ వీకెండ్ స్పెషల్‌లో సమోసా రెసిపీని మీ ముందుకు మేము తీసుకొని వచ్చాము. ఇంట్లో వున్న వంట వస్తువులతోనే సమోసాను సులభంగా తయారు చేసుకోవచ్చు. సమోసాల్లో చాలా రకాలు వుంటాయన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఉల్లిపాయ సమోసా, కార్న్ సమోసా, పనీర్ సమోసా, చికెన్ సమోసా, ఆలూ సమోసా ఇలా చాలా రకాల సమోసాలు వుంటాయ్. ఈ రెసిపీలో మనము ఉల్లిపాయ సమోసాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
సమోసా తయారు చేసుకునే విధానం :
ముందుగా 300ల గ్రాముల ఉల్లిపాయలను తీసుకోవాలి. వాటిని కోసిన తరువాత ఆ ఉల్లిపాయ ముక్కలను ఎండలో లేదంటే ఫ్యాన్ కిందైనా సరే 1 గంటపాటు ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి, అందులోనే తగినంత ఉప్పువేసి కలుపుకోవాలి. పిండిలో తగినన్ని నీళ్లు పోసి సమోసా తయారీ కోసం పిండిని బాగా కలుపు కోవాలి. పిండి పలుచగా కాకుండా , గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా వుండేలా పిండిని వత్తుకోవాలి.

మొత్తం కలుపుకున్న పిండిని చిన్న ఉండల్లా ఎన్ని సమోసాలు చేయాలనుకుంటున్నారో అన్ని ఉండలను చేసుకోవాలి. ఉల్లిపాయ సమోసా కాబట్టి చిన్న సైజులో చేసుకుంటేనే మంచిది. కలుపుకున్న పిండిలో సుమారుగా 5 నుంచి 6 చపాతీలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలపై పొడిపిండిని చల్లి ఒకదానిపై ఒకటిని పెట్టాలి. చపాతీల నాలుగు మూలలను కట్ చేసి డబ్బా (స్క్వేర్) షేపులో చేసుకోవాలి. ఆ డబ్బాను రెండు భాగాలుగా చేసుకుంటే మొత్తం 8 సమోసాలను చుట్టడానికి చపాతీలు రెడీ అవుతాయ్. ఇప్పుడు వీటిని ఆరిపోకుండా జాగ్రత్తగా బట్టలో చుట్టి పెట్టాలి.
సమోసా మసాలా కలుపుకోవడానికి అంతకు ముందు ఆరబెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక బౌల్లో వేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక పావు కప్పు మైదాపిండిలో కొన్ని నీళ్లు పోసుకొని చిక్కని పేస్ట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు సమోసా చేయడానికి రెడీ చేసుకున్న చపాతీలను బయటకు తీసి వాటిని కోన్‌లా చేసుకోవాలి. చేసుకున్న కోన్‌లో కలుపుకున్న ఉల్లిపాయ మసాలాను వేసుకోవాలి. పక్కకు రెడీ చేసిపట్టుున్న చిక్కని మైదా పేస్టును కోన్ అంచులకు అంటించి ఆ మసాలాను మూసివేయాలి. దీంతో ఒక సమోసాను వేయించడానికి రెడీ చేసుకున్నట్టే.
మిగిలిన అన్నింటిని ఇలాగే తయారు చేసుకొని గాలికి కొంత సమయం వరకు ఆరబెట్టాలి. ఇప్పుడు ప్యాన్‌లో సమోసాలు వేంచడానికి సరిపడా నూనెను ఖడాయ్లో వేసుకొని నూనెను కాగించాలి. అందులో సమోసాలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయిస్తేనే సమోసాలా క్రంచీగా వుండి బాగా ఫ్రై అవుతాయ్. ఇప్పుడు సమోసాలు తినడానికి రెడీ. చాలా సింపుల్‌గా స్ట్రీట్స్లైల్లో సమోసాలు చేసుకున్నాం కదా. సమోసాలను జంక్ ఫుడ్ అంటాము. బయట వేయిచిన నూనెలోనే మల్లీ వేయిస్తారు. అది ఆరోగ్యకరం కాదు. కాబట్టి ఇంట్లోనే సమోసాను తయారు చేసుకుందాం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications