Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
పానీ పూరీ ఇంట్లోనే చేసుకుందాం.. శుభ్రంగా టేస్టీగా తిందాం..!
పానీ పూరీ బండిమీద కాదు ఇంట్లోనే చేసుకుందాం. పానీ పూరీ రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాం. చాలా సింపుల్‌గా, ఇంట్లో వున్న పదార్ధాలతోనే ఈజీగా చేసుకోవచ్చు.

పానీ పూరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు
ఒక కప్పు బఠానాలు
ఒక కప్పు బొంబాయ్ రవ్వ
3 టీస్పూన్ల గోదుమ పిండి
వంటసోడా
3 ఆలుగడ్డలు
మంచి నూనె
చింతపండు రసం
1 కొత్తిమీర కట్ట
1 కట్ట పూదీన
3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం
నల్లుప్పు, నిమ్మకాయ
అర టీస్పూన్ కారంపొడి, అర టీస్పూన్ జీరా పొడి
ఉప్పు, చాట్ మసాలా మిరియాల పొడి
ధనియాల పొడి

పానీ పూరీ తయారు చేసే విధానం
1. పానీ పూరీలో మసాలా చేయడానికి ముందుగా ఒక కప్పు బఠానాలను
నానబెట్టాలి.
2. ఒక కప్పు బొంబాయ్ రవ్వను బౌల్లోకి తీసుకోవాలి.
3. 3 టీస్పూన్ల గోదుమ పిండిని బౌల్లో యాడ్ చేయాలి.
4. బౌల్లో చిటికెడంత వంట సోడాను కలుపుకోవాలి.
5. బౌల్లో సరిపడ నీళ్లను పోసుకొని బాగా కలుపుకోవాలి.
6. పిండి సాఫ్ట్‌గా వుండేలా చూసుకోవాలి.
7. పిండిపై బట్టను వేసి పది నిమిషాలు పక్కన బెట్టాలి.
8. ఒక కుక్కర్లో మూడు ఆలుగడ్డలను కట్ చేసుకొని
వేసుకోవాలి.
9. కుక్కర్లో ఒక కప్పు నీళ్లు వేసి మూడు విజిల్స్ వచ్చేంత
వరకు పెట్టుకోవాలి.
10. కుక్కర్లో బఠానీలు వేసి నీళ్లు పోసి ఉడకబెట్టాలి.
11. పిండి ముద్దను తీసుకొని చపాతీల్లా రోల్ చేసుకోవాలి.
12. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా చపాతీలను రోల్
చేయాలి.
13. చిన్నగా వున్న గిన్నెను తీసుకొని పూరీల్లా కట్ చేసుకోవాలి.
14. ఎక్స్ట్రా పిండిని తీసేసి పూరీలను ఒక ప్లేటులోకి
తీసుకోవాలి.
15. పూరీలు ఆరిపోకుండా వాటిపై ఒక టవల్‌ను కప్పాలి.
16. కడాయ్‌లో నూనెను బాగా వేడి చేయాలి.
17. అందులో ఒక్కొక్క పూరీని వేసుకుంటూ ఫ్రై చేయాలి.
18. పూరీని బాగా పొంగే విధంగా చూసుకోవాలి.
19. పూరీ పొంగిన తరువాత మరో పూరీని వేసి ఫ్రై చేయాలి. ఇలా మూడు నాలుగు
పూరీలను ఒకేసారి ఫ్రై చేసుకోవాలి.
20. పూరీలు మాడిపోకుండా చూసుకోవాలి. దీంతో పానీపూరీ కోసం పూరీలూ రెడీ
అయినట్టే.
21. పానీపూరీ రసం చేయడానికి చింతపండు రసాన్ని తీసుకోవాలి.
22. ఒక బౌల్లో చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసి
తీసుకోవాలి.
23. ఒక మిక్సీ జార్లో చిన్నసైజు కొత్తిమీర కట్టును
వేసుకోవాలి. ఒక పిడికెడంత పూదీనాను కూడా యాడ్ చేసుకోవాలి.
24. 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం, కొద్దిగా నల్లుప్పును
వేసుకోవాలి. అర చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి.
25. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. కొన్ని
నీళ్లను కూడా పోసుకొని మెత్తగా చేసుకోవాలి.
26. ఈ మొత్తాన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. 2
గ్లాసుల వరకు నీళ్లను యాడ్ చేయాలి. 27. చింతపండు రసాన్ని కూడా యాడ్
చేసుకోవాలి.
27. రుచికోసం అర టీస్పూన్ కారంపొడి, అర టీస్పూన్ జీరా పొడి, రుచికి
సరిపడ ఉప్పు, ఒక టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ మిరియాల పొడి
కూడా వేసి బాగా కలుపుకోవాలి.
28. ఒక బౌల్లో మూడు ఉడికించిన ఆలుగడ్డలను స్మాష్
చేసుకోవాలి.
29. ఇందులోనే ఉడికించిన తెల్లబఠానీలను కూడా యాడ్ చేయాలి.
30. సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి.
31. అర టీస్పూన్ వేయించిన జిలుకర పొడి, అర టీస్పూన్ చాట్ మసాలా, ఒక టీ
స్పూన్ కారంపొడి, పావు టీస్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల
పొడి, రుచికి సరిపడ ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.
32. ఇప్పుడు పూరీ, మసాలా, పానీ అన్నీ తయారైనట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications