Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
పాస్తాతో కుర్ కురే.. అసలు కుర్ కురే కన్నా క్రంచీగా, స్పైసీగా..!!
కుర్‌కురేను మార్కెట్లో కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పాస్తా ఉంటే చాలా సింపుల్‌గా కుర్ కురేలు రెడీ అయిపోతాయ్. దీనికి కావాల్సిన పదార్దాలు, మాకరోని పాస్తా, నూనె, కారం పొడి, ఉప్పు, బియ్యం పిండి, గరం మసాలా, చాట్ మసాలా. వీటితోనే మాకరోని పాస్తా కుర్ కురే చేసుకొని కరకరా తినేయొచ్చు.

పాస్తా కుర్ కురే తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి :
2 కప్పుల మాకరోని పాస్తా
మంచి నూనె
ఉప్పు
2 స్పూన్ల కార్న్ ఫ్లోర్
2 టీస్పూన్ల బియ్యం పిండి
అరటీస్పూన్ కారంపొడి
పావు టీస్పూన్ గరం మసాలా
అరటీస్పూన్ చాట్ మసాలా
పాస్తా కుర్ కురేను ఈ కింది విధంగా రెడీ చేసుకోవాలి :
1. ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్పుల మాకరోని పాస్తాను తీసుకోవాలి. రెండు కప్పుల పాస్తాను తీసుకున్నాం కాబట్టి ఒక ప్యాన్‌లో దానికి డబుల్‌గా 4 కప్పుల నీళ్లను పోసుకొని అందులో 2 కప్పుల పాస్తాను వేసి బాగా ఉడికించాలి. ఈ నీళ్లలోనే 2 టీస్పూన్ల మంచి నూనెను, ఒక టీస్పూన్ ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.
2. నీళ్లు మసులుతుండగానే రెండు కప్పుల మాకరోని పాస్తాను ప్యాన్ బౌల్‌లో వేసుకోవాలి. పాస్తాలను మొత్తం ఉడికించకుండా 70 నుంచ 80 శాతం వరకు మాత్రమే ఉడికించాలి. కొంచెం సాఫ్ట్ అయితే మాకరోనీ పాస్తా రెడీ అయినట్లు అర్థం చేసుకోవాలి.
3. స్టవ్ ఆఫ్ చేసి పాస్తాను మొత్తం స్టైనర్‌లోకి తీసుకోవాలి. పాస్తాను మళ్లీ ఒకసారి బాగా కడగాలి. పాస్తాలో ఉన్న నీళ్లని ఫిల్టర్ అయ్యేలా చూసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ను యాడ్ చేసుకోవాలి. 2 టీస్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి.
4. ఇప్పుడు ఒక ప్యాన్లో మంచినూనెను పోసుకొని బాగా వేడి చేయాలి. అందులో పాస్తాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాగుతున్న నూనెతో పాస్తాలు వేసిన తరువాత 40 సెకండ్లు కలపకుండా అలాగే వదిలి వేయాలి. వెంటనే పాస్తాను కలిపితే దానికి ఉన్న పిండి మొత్తం నూనెలో పడిపోతుంది.
5. పాస్తా క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పాస్తాను మధ్యమధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు చట్ పట్ అనే సౌండ్ వస్తుంది. కంగారు పడకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన పాస్తాలన్నింటినీ ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. మిగిలిన పాస్తాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
6. పాస్తాను నేరుగా కూడా అలాగే తినేయొచ్చు. ఇందులో అరటీస్పూన్ కారంపొడి, కొంచెం ఉప్పు, పావు టీస్పూన్ గరం మసాలా, అరటీస్పూన్ చాట్ మసాలాను వేసుకోవాలి. దీన్ని బాగా టాస్ చేసుకోవాలి. ఇక దీంతో పాస్తా కుర్‌కురే రెడీ అయినట్టే. ఈ పాస్తా కుర్ కురేను వారం పాటు నిల్వ ఉంచుకొని తినొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications