Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
కోటీశ్వరులు కూడా కక్కుర్తి పడి తినే రెసిపి ఇదే..ఎలా చేయాలంటే
సీ ఫుడ్ ని ఇష్టపడేవాళ్లలో చాలామంది ఇష్టపడే వంటకం పీతల ఇగురు. దీని రుచి అమోఘం,అద్భుతం. మాటల్లో వర్ణించలేని టేస్ట్ దీనిది. పీత మాంసం తియ్యని రుచి, సుగంధ ద్రవ్యాల ఘాటు, చిక్కటి గ్రేవీ ఈ వంటకాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అన్నం, చపాతీతో ఇది తింటే చాలా బాగుంటుంది. కోటీశ్వరులు కూడా కక్కుర్తిపడి మరీ తినే పీతల ఇగురు ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలి, దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
పీతల ఇగురు తయారీకి కావలసిన పదార్థాలు
పీతలు - 1 కేజీ
చింతపండు రసం - 1/2 కప్పు
నూనె - 4-5 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - 1/2 టీ స్పూన్
కారం - 2-3 టీ స్పూన్లు
ఉల్లిపాయలు - 2 పెద్దవి
పచ్చిమిర్చి - 3-4
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
గరం మసాలా - 1 టీ స్పూన్
టమోటాలు - 2 మీడియం సైజు
ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
జీలకర్ర పొడి - 1 టీ స్పూన్

పీతల ఇగురు తయారీ విధానం
-ముందుగా ముందుగా పీతలను శుభ్రంగా కడిగి వాటి కాళ్లు, పెంకులను వేరు చేయండి. పెద్ద పీతలైతే వాటిని రెండు లేదా మూడు ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి,తరగిన ఉల్లిపాయలు వేసి అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించాక తరిగిన టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. మసాలాలు నూనెలో కొద్దిసేపు వేగనివ్వండి.
-ఇప్పుడు అందులో శుభ్రం చేసుకున్న పీతల ముక్కలు వేసి మసాలాలు బాగా పట్టేలా కలపాలి.
-ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలపండి.
-తర్వాత చింతపండు రసం పోసి బాగా కలిపి మూత పెట్టేయాలి. 10-15 నిమిషాలు లేదా పీతలు పూర్తిగా ఉడికే వరకు మీడియం మంటమీద ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అవసరమైతే కొద్దిగా నీరు చేర్చవచ్చు.
-గ్రేవీ చిక్కబడిన తర్వాత గరం మసాలా, తరిగిన కొత్తిమీర వేసి కలిపి ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే పీతల ఇగురు రెడీ.
-వేడి వేడి పీతల ఇగురు అన్నం, రొట్టె లేదా చపాతీతో వడ్డించండి.
సమ్మర్ లో ఈ అట్లే తినాలి..శరీరానికి చలువతో పాటు ఆరోగ్యం కూడా,ఎలా చేయాలంటే..
ఆరోగ్య ప్రయోజనాలు
పీతలు రుచికరమైనవే కాకుండా అనేక పోషక విలువలను కలిగి ఉంటాయి. పీతలు
అధిక మొత్తంలో ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. ఇది కండరాల
నిర్మాణం, మరమ్మత్తుకు చాలా అవసరం. ఒక కప్పు ఉడికించిన పీత మాంసంలో
దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పీతలలో కొవ్వు శాతం చాలా
తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంతృప్త కొవ్వు తక్కువగా ఉండటం వల్ల ఇది
గుండె ఆరోగ్యానికి మంచిది. పీతలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును తగ్గించడానికి,
శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
