Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
2024 మోస్ట్ ఫేవరెట్ రెసిపి..ఆంధ్రా స్పెషల్ ఆవకాయ పచ్చడి..ఇలా చేస్తే ఎన్ని నెలలైనా పాడవదు
ఆవకాయ పచ్చడి తెలియని తెలుగువారుండరు. ధనవంతులైనా,పేదలైనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవకాయ ఉండి తీరాల్సిందే. ఆవకాయ టేస్ట్ మేరే ఇతర పచ్చడికి రాదు. ఆవకాయ పచ్చడి అంటే మన దగ్గరే కాదు వరల్డ్ వైడ్ ఫేమస్. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది సెర్చ్ చేసిన 4వ ఇండియన్ రెసిపి కూడా ఇదే. తెలుగు రాష్ట్రాల్లో అయితే బంధువులు ఇంటి నుంచి వెళ్లేటప్పుడు వారికి ఓ డబ్బాలో ఆవకాయ పచ్చడిని పెట్టి పంపడం మన సంప్రదాయంగా మారిపోయింది. అయితే ఆంధ్రా స్పెషల్ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
ఆవకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్ధాలు
-పచ్చడి మామిడికాయ
-నూనె
-ఉప్పు
-కారం
-పసుపు
-మెంతులు
-ఆవపిండి
-వెల్లుల్లి

ఆవకాయ పచ్చడి తయారీ విధానం
-ముందుగా 2 కేజీల(10 కాయలు)పచ్చడి మామిడికాయలను తీసుకోండి. మామిడికాయ పుల్లగా ఉండి,పీచు ఎక్కువగా ఉండాలి. కండ తక్కువగా ఉండాలి.
-మామిడికాయలను శుభ్రంగా కడిగి తడిగుడ్డతో తుడిచిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి.
-ముక్కలుగా కట్ చేసిన తర్వాత అందులోని జీడిని తీసేయండి. టెంకకు ఉండే పైన పొరను కూడా తీసేయాలి.
-ముక్కలన్నింటినీ పొడి గుడ్డతో శుభ్రంగా క్లీన్ చేసి ఓ గిన్నెలో వేసి పెట్టుకోండి.
-తర్వాత 1 లీటర్ నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనెను ఓ గిన్నెలో తీసుకోండి. ఇందులోని 200 గ్రాముల ఆయిల్ ని మామిడికాయ ముక్కల్లో పోయండి.
-తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 300-350 గ్రాముల కారం,100-150 గ్రాముల ఆవపిండి,350-400 గ్రాముల మిక్సీలో వేసి పొడి చేసిన కల్లు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్ పసుపు,పొట్టు తీసేసిన 100-150 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నీ కలిసేలా గరిటతో బాగా కలిపి ఇదంతా మామిడికాయ ముక్కల్లో పోసి కలపండి.
-ఇప్పుడు గిన్నెలో మిగిలిన 800 గ్రాముల ఆయిల్ ని కూడా మామిడికాయ ముక్కల్లో పోసేసి అంతా కలిసేటట్లుగా గరిటతో బాగా కలపండి.
-తర్వాత మామిడికాయ ముక్కలను ఓ జాడీలోకి లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి లేదా గాజు సీసాలోకి వేసుకోండి.
-జాడీలో వేసినట్లయితే జాడీ మూత పెట్టి దానిని ఓ గుడ్డతో చుట్టూ కట్టేసి 3 రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టేయండి.
-3 రోజుల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు పచ్చడిని తిరగ కలుపుకోవాలి. ఇందుకోసం ఓ పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఈ పచ్చడిని వేసేయండి. గరిటతో కలుపుకొని మళ్లీ పచ్చడిని జాడీలోకి వేసుకోండి. అంతే ఆవకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి సంవత్సరం అయినా నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications