Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
గుత్తి వంకాయ దమ్ బిర్యానీ..అసలు సిసలు ఆంధ్రా టేస్ట్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
ఈరోజుల్లో చాలామంది ఆరోగ్యం కోసం శాకాహార వంటకాలను ఇష్టపడుతున్నారు. అందులో భాగంగా శాఖాహారంలోనే రుచి, ఆరోగ్యం రెండూ లభించేలా ఎన్నో రకాల వంటకాలను ప్రయత్నిస్తున్నారు. అలాంటి అద్భుతమైన వంటకాల్లో ఒకటి గుత్తి వంకాయ దమ్ బిర్యానీ. ఇది దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన వంటకం. ఈ బిర్యానీ సాధారణ బిర్యానీలకు భిన్నంగా ఉంటుంది. దీనిలో గుత్తి వంకాయలను మసాలాలతో నింపి, బిర్యానీతో దమ్ చేయడం వల్ల దీనికి ప్రత్యేకమైన రుచి వస్తుంది. గుత్తి వంకాయ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
గుత్తి వంకాయ దమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-వంకాయలు
-ఉల్లిపాయలు
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-పుదీనా ఆకులు
-కొత్తిమీర ఆకులు
-మసాలా దినుసులు
-నెయ్యి
-నూనె
-ఉప్పు
-కారం పొడి
-వేరుశెనగలు
-అల్లం
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి

గుత్తి వంకాయ దమ్ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా 2 కప్పుల బాస్మతి బియ్యం(400 గ్రా)శుభ్రంగా కడిగి తర్వాత నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి.
-బియ్యం నానేలోగా 12 నల్లటి గుత్తి వంకాయలు తొడిమను కొంచెం కట్ చేసి వంకాయను నాలుగు గాట్లుగా పెట్టి ఉప్పు నీళ్లలో వేసుకోండి.
-అన్ని వంకాయలను నాలుగు గాట్లుగా పెట్టి ఉప్పు నీళ్లలో వేసుకోండి.
-తర్వాత మిక్సీ జార్ లో 1 ఇంచు అల్లం ముక్కలు, పొట్టు తీసేసిన 15 వెల్లుల్లి రెబ్బలు, 5 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, 4 యాలకలు, వేయించిన 3 టేబుల్ స్పూన్ల పల్లీలు,2 టీస్పూన్ల కారం, 5 పచ్చిమిరపకాయలు, ఒకటిన్నర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు లేకుండానే మెత్తగా గ్రైండ్ చేయండి.
-ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్లోకి మిక్సీలో వేసి చేసుకున్న మసాలా పేస్ట్ ని స్టఫ్ చేసుకోండి. మిగిలిన దాన్ని పక్కన పెట్టుకోండి
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి పోసి వేడి చేసి ఇందులో సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి.
-ఉల్లిపాయలు వేగాక వాటిని ఓ ఫ్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో మిగిలి ఉన్న ఆయిల్ లోనే స్టఫ్ చేసిన వంకాయలను వేసి కలిపి మూతపెట్టి తక్కువ మంటమీద 5 నిమిషాలు ఉడికించాలి.
-వంకాయల్లో స్టఫ్ గా పెట్టగా మిగిలిపోయిన మసాలా ముద్దలో ముప్పావు కప్పు పెరుగు,1 టీస్పూన్ బిర్యానీ మసాలా, 8 క్రష్ చేసిన మిరియాలు వేసి బాగా కలపండి.

-ఇప్పుడు పాన్ లో వంకాయలు 70 శాతం ఉడికితే అందులో బిర్యా ఆకులు 2, మరాఠీ మొగ్గలు 2, షాజీరా, రాతి పువ్వు, స్టార్ అనాస, కొంచెం దాల్చిన చెక్క,ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి.
-ఇప్పుడు అందులో కలిపి పెట్టిన మసాలా పెరుగు వేసి ఇందులోనే పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి నిదానంగా కలుపుతూ 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఇప్పుడు అందులో అర చెక్క నిమ్మరసాన్ని చుట్టూర పిండుకోండి.
-ఇప్పుడు అన్నం వండడానికి సరిపడా గిన్నెను తీసుకొని అందులో సగానికి పైగా నీళ్లు పోసి 1 టీస్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకలు, కొద్దిగా రాతి పువ్వు, 10 మిరియాలు, 2 చీల్చిన పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీస్పూన్ల నెయ్యి లేదా ఆయిల్ వేసి నీళ్లను మరిగించాలి.
-నీళ్లు మసలుతున్నప్పుడు అందులో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి మధ్య మధ్యలో కలుపుతూ 80 శాతం వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-తర్వాత పెద్ద కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో అర టీస్పూన్ నెయ్యి వేసి స్ప్రెడ్ చేసి ఉడికించిన అన్నాన్ని ఇందులో వేయండి. ఇందులో ఫ్రై చేసిన ఉల్లిపాయలు కొన్ని, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగే, రెడీ చేసిన గుత్తివంకాయ మసాలా మొత్తం వేసేయండి. 2 టీస్పూన్ల నెయ్యిని బిర్యానీ మద, అలాగే వేడి నీళ్లలో నానబెట్టిన చిటికెడు కుంకుమ పువ్వును నానబెట్టిన నీళ్లతో సహా ఇందులో వేసేయండి. మూతపెట్టి 10 నిమిషాలు తక్కువ మంటమీద దమ్ చేయండి. తర్వాత మూత తీస్తే టేస్టీ వంకాయ దమ్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications