Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ఇంట్లో ఇలా ఛాయ్ పెడితే..టీ స్టాల్ Tea టేస్ట్ కన్నా అదిరిపోతుంది
చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి అయితే పొద్దున్నే నిద్రలేవగానే ఓ కప్పు టీ తాగనిదే డే స్టార్ట్ అవ్వదు. కొంతమంది ఇంట్లో టీని మాత్రమే తాగుతుంటారు. మరికొందరు ఎక్కడ లభించినా తాగేస్తుంటారు. ఆఫీసులలో,ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులు అయితే కొందరు రోజులో నాలుగైదు సార్లు టీ తాగుతుంటారు. ఓ కప్పు ఛాయ్ తాగివస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది, కొత్త ఆలోచనలు వచ్చి వర్క్ లో దూసుకెళ్లవచ్చుని చాలామంది భావిస్తుంటారు.
టీని ఒక్కొక్కరూ ఒక్కోలా పెడుతుంటారు. అయితే బయట టీ స్టాల్స్ లో మనం తాగే టీ ఒక టేస్ట్ ఉంటుంది..మన ఇంట్లో తాగే టీ మరో టేస్ట్ ఉంటుండటం మనం తరచుగా గమనిస్తుంటాం. అయితే టీని ఎప్పుడు చేసినా బాగా ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం. అయితే ఉదాహరణగా ఓ ఇద్దరికి మాత్రమే సరిపడా టీ పెట్టుకోవాలంటే ఏమేం కావాలి..తయారీ విధానం ఎలా అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

మసాలా టీ తయారీకి కావాల్సినవి
మంచినీళ్లు- 2 టీ గ్లాస్ లు
యాలకులు-2
అల్లం-కొంచెం తగినంత
దాల్చినచెక్క-1 ముక్క
టీ పొడి- 2 టీ స్పూన్లు
చక్కెర-2 టీ స్పూన్లు
పాలు- 1నుండి 1/2 కప్పు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఓ టీ బౌల్ పెట్టండి
-టీ కప్పుతో లేదా టీ గ్లాస్ తో అయినా రెండు గ్లాస్ ల నీళ్లని తీసుకొని
స్టవ్ మీద పెట్టిన బౌల్ లో పోయండి.
-ఆ నీళ్లని బాగా వేడి చేయండి. ఈ సమయంలో రెండు యాలకులను,కొంచెం అల్లంని
కలిపి బాగా దంచండి.మెత్తగా దంచాల్సిన అవసరం లేదు.
-ఇప్పుడు బాగా మరిగిన నీళ్లల్లో ఈ దంచిన యాలకులు,అల్లం మిశ్రమాన్ని
వేయండి. ఓ దాల్చిన చెక్కను కూడా ఆ మరిగే నీళ్లల్లో వేయండి.
-ఒకటి రెండు నిమిషాల పాటు దానిని కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్ లో
పెట్టి ఉడికించండి.
-తర్వాత అందులో రెండు టీ స్పూన్ ల టీ పొడిని తీసుకొని అందులో వేయండి.
ఆ తర్వాత వెంటనే రెండు టీ స్పూన్ల చక్కెర కూడా అందులో వేయండి.
-గరిటతో బాగా కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించండి. రెండు మూడు నిమిషాలు
డికాషన్ ని బాగా మరగబెట్టాక ఇందులో ఏ గ్లాస్ తో అయితే నీళ్లను
కొలిచామో అదే గ్లాస్ తో ముందుగానే వేడి చేసి ఉంచిన పాలను 1 లేదా 1/2
టీ గ్లాస్ తో తీసుకోని మరుగుతున్న డికాషన్ లో కలుపుతూ ఉడికించాలి.
అప్పుడు మంట మీడియం నుంచి హై ప్లేమ్ లో మధ్యలో పెట్టి టీ పొంగిపోకుండా
గరిటతో తిప్పుతూ ఉండండి.
-రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికిస్తే గుమగుమలాడే రుచికరమైన టీ రెడీ
అయిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications