Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Moringa paratha: ప్రధాని మోదీ ఫేవరెట్..'మునగాకు పరోటా' ఇలా చేస్తే టేస్ట్ అదరహో
సాధారణంగా దక్షిణ భారతదేశంలో మునగకాయలను(drumstick) సాంబార్ లో వేసి వంట చేస్తుంటారు. మునగకాయతో అనేక ఇతర వంటకాలు చేసినప్పటికీ మునగకాయలు వేసి చేసే సాంబార్ అంటేనే మనోళ్లు లొట్టలేసుకొని తింటారు. మునగకాయలు మంచి ఎనర్జీ ఇస్తాయనే ఉద్దేశ్యంతోనే కొత్తగా పెళ్లైన మగాళ్లు వీటిని ఎక్కువగా తింటుంటారు. కొన్ని ప్రాంతాల్లో కొత్తగా పెళ్లైన అల్లుడు ఇంటికి వస్తే మూడుపూట్ల మునగకాయ వంటకాలు చేసి పెడుతుంటారు.
మునగకాయలే కాదు మనుగ ఆకులు(moringa) కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మునగ ఆకుని వారంలో ఒకసారి అయినా ఆహారంలో చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెప్తుంటారు. అయితే మునగ ఆకులతో చేసే పరోటా టేస్ట్ వేరే లెవల్లో ఉంటుంది. మునగాకు పరోటా రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఓ సందర్భంలో తన ఫేవరెట్ రెసిపీ మునగాకు పరోటా(moringa paratha) అని చెప్పారు. అయితే మోదీకి ఇష్టమైన మునగాకు పరోటా ఎలా చేయాలి,దీని తయారీకి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
మునగాకు పరోటా విత్ రైతా తయారీకి కావాల్సిన
పదార్థాలు
-మునగకాయలు
-మునగాకు
-గోధుమపిండి
-ఉప్పు
-జీలకర్ర పొడి
-ఆమ్చూర్ పొడి
-ఉల్లిపాయ
-టమాటో
-కారం
-కీర దోసకాయ
-కొత్తిమీర
-మిరియాల పొడి
-నిమ్మరసం
-ఆయిల్
-పెరుగు
మునగాకు పరోటా విత్ రైతా,సలాడ్ తయారీ విధానం
-ముందుగా మునగకాయలను ముక్కలుగా కట్ చేసి వాటిని శుభ్రంగా కడిగి ఓ స్టీల్ గిన్నెలో వేయండి.
-తర్వాత అందులో ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి చిన్నగా ఉడకనివ్వండి.
-మునగకాయలు ఉడికేలోగా రోటీలో నంచుకోడానికి రైతా తయారుచేసుకోండి. ఇందుకోసం ఒక కీరాని సన్నగా తరుముకొని పక్కనపెట్టకోండి. ఓ బౌల్ లో పెరుగు తీసుకొని అందులో ఈ తురుముకున్న కీరా, సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ,సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, రుచికి సరిపడా ఉప్పు,అర స్పూన్ మిరయాల పొడి వేసి బాగా కలిపి కొంచెం టేస్ట్ చూసి ఏదైనా సరిపోకపోతే ఉప్పులాంటివి కొంచెం కలుపుకోవచ్చు. ఈ రైతాని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఓ బౌల్ తీసుకొని అందులో మీడియం సైజ్ లో కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజ్ లో కట్ చేసిన కొన్ని కీరా ముక్కలు, మీడియం సైజ్ లో కట్ చేసిన 1 టమాటో ముక్కలు,అర స్పూన్ మిరియాల పొడి,పావు స్పూన్ వేయించి దంచిన జీలకర్ర పొడి,సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, కొంచెం నిమ్మరసం,2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపితే రోటీలో పెట్టుకోడానికి సలాడ్ రెడీ. దీన్ని ఓ పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు బాగా లేతగా ఉండే మునగాకులను రోటీకి కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని ఓ బౌల్ లో వేసి బాగా శుభ్రంగా కడగండి.
-తర్వాత స్టవ్ మీద ఉంచిన ముగకాయలు మెత్తగా ఉడికిన తర్వాత పప్పుగుత్తితో మెత్తగా మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసి బాగా కలిపిన తర్వాత పిప్పి అంతా వడకట్టి రసాన్ని ఓ బౌల్ లో తీసుకోండి.
-మునగాకు రసంలో రుచికి సరిపడా ఉప్పు,అర స్పూన్ కారం,అర స్పూన్ వేయించి దంచిన జీలకర్ర పొడి, 1 స్పూన్ ఆమ్చూర్ పొడి(మామిడి వరగు పొడి),కీన్ చేసి పెట్టుకున్న మునగాకు(1 కప్పు), గోధుమపిండి రెండు కప్పులు,కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపుకోండి. తర్వాత ఇందులో రెండు స్పూన్స్ నూనె వేసి పిండి అంతా కలిసేలా బాగా కలిపి పిండిముద్దలా చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఆ పిండిముద్దను కొంచెం తీసుకొని చపాతీ పీట మీద కొంచెం పొడి గోధుమపిండి చల్లుకొని ఆ పిండిముద్దను మీడియం సైజ్ లో ఉండేలా వత్తుకోవాలి.
-తర్వాత దాన్ని వేడి వేడి పెనం మీద వేసి నెయ్యి లేదా నూనెతో రెండువైపులా బాగా కాల్చుకోండి. మునగాకు రోటీ రెడీ.
-మునగాకు రోటీలో ముందుగా రెడీ చేసుకున్న సలాడ్ కొంచెం పెట్టి దాని మీద ముందుగానే ప్రిపేర్ చేసిన రైతా కొంచెం వేసి తింటుంటే ఎవరైనా సరే అదరహో అంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












