Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పొటల్స్ కర్రీ.. నాటు దొండకాయలు.. సీజన్ అయిపోకముందే ఇలా టీస్టీగా చేసుకోండి..!
పొటల్స్ కర్రీని ఇదే సీజన్‌లో త్వరగా చేసుకోండి. ఎందుకంటే పొటల్స్ ప్రతీ సీజన్‌లో రావు. ఈ పొటల్స్‌ను పర్వల్లు, నాటు దొండకాయలు అని కూడా అంటాము. చూడ్డానికి ఇవి దొండకాయల్లాగే వుంటాయ్. కానీ టేస్టు చాలా బాగుంటుంది. ఈ వీకెండ్‌లో నాన్‌వెజ్‌తో పాటు ఇలాంటి వెరైటే వెజ్ కర్రీని చేసుకుందాం. మామూలు కూర రచేసినట్టుగానే చేయవచ్చు, కానీ కొంత మసాలాను గ్రైండ్ చేసుకోవాల్సి వుంటుంది. మరి పొటల్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

పొటల్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట సామాగ్రి :
పావుకిలో పొటల్స్
రెండు ఉల్లిపాయలు
రెండు టమాటాలు
1 టేబుల్ స్పూన్ మంచి నూనె
చిటికెడ్ పసుపు
పావు టీస్పూన్ ఉప్పు
12 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు
ఒక ఇంచు అల్లం ముక్క
3 టేబుల్ స్పూన్ల మంచి నూనె
అర టీస్పూన్ జిలుకర
అర టీస్పూన్ పచ్చి చెనగపప్పు
అర టీస్పూన్ మినపప్పు
గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్టు
2 పచ్చిమిరపకాయలు
కొన్ని కరివేపాకుల
రుచికి సరిపడ ఉప్పు
పావు టీస్పూన్ పసుపు
2 టీస్పూన్ల కారంపొడి
1 టీస్పూన్ ధనియాల పొడి
పొటల్స్ కర్రీ, పరవల్ల కూడా తయారు చేసుకునే విధానం ఇదే :
1. ముందుగా పావుకిలో పొటల్స్ ను తీసుకోవాలి. రెండు ఉల్లిపాయలను, రెండు టమాటాలను కూడా తీసుకోవాలి. వీటిని బాగా కడిగి కట్ చేసుకోవాలి.
2. పొటల్స్‌ను కట్ చేసే ముందు వాటిపైన వున్న పొట్టును తీసేసుకోవాలి. ఇలా తీయడం వల్ల పర్వల్లు తొందరగా ఉడుకుతాయ్. చాలా టేస్టీగా కూడా అవుతాయ్. వీటి మొదలు చివర కట్ చేసి, దొండకాయలు కట్ చేసినట్టుగా గుండ్రంగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ మంచి నూనెను పోసుకోవాలి. ఒక చిటికెడ్ పసుపు, పావు టీస్పూన్ ఉప్పును వేసుకొని ఇందులో కట్ చేసిన పర్వల్లను యాడ్ చేసుకోవాలి. వీటిని రెండు నిమిశాలపాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి.
4. మిక్సీ జార్‌లో కట్ చేసిన రెండు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 12 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలను, ఒక ఇంచు అల్లం ముక్కను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి.
5. ఇప్పుడు ప్యాన్‌లో పర్వల్లు బాగా ఉడికి వుంటాయ్. ఈ పర్వల్లను ఒక ప్లేటులోకి తీసుకోవాలి. అదే ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ల మంచి నూనె వేసుకొని అర టీస్పూన్ జిలుకర, అర టీస్పూన్ పచ్చి చెనగపప్పును, అర టీస్పూన్ మినపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్టును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
6. మరో పక్క మిక్సీ జార్‌లోకి కట్ చేసిన రెండు టమాటాలను వేసుకోవాలి. టమాటాలను గ్రైండ్ చేసుకొని పేస్టులా మార్చుకోవాలి.
7. ప్యాన్‌లో ఉల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అయిన తరువాత అందులోనే 2 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకులను, టమాట పేస్టును యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి టమాట పేస్టును బాగా ఫ్రై చేసుకోవాలి.
8. ఇందులో రుచికి సరిపడ ఉప్పును, పావు టీస్పూన్ పసుపును, 2 టీస్పూన్ల కారంపొడి, 1 టీస్పూన్ ధనియాల పొడిని వేసుకొని తక్కువ మంటపైన వీటిని ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిశాలు ఫ్రై చేసిన తరువాత ఇందులో పరవల్లను యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం బాగా పట్టేలా కలిపి, తక్కువ మంటపైన 3 నిమిశాల వరకు ఉడికించాలి.
9. అరకప్పు నీళ్లను పోసుకొని బాగా ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిశాల వరకు బాగా ఉడికించాలి. 10 నిమిశాల తరువాత మూత తీసి చూస్తే కూర బాగా ఉడికిన విషయాన్ని మనం చూడవచ్చు. రుచికి సరిపడ ఉప్పు వుందా లేదా చెక్ చేసుకోవాలి.
10. రుచి మరింత బాగా కావడానికి అరటీస్పూన్ గరం మసాలా పొడిని, కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా కలుపుకుంటే పరవల్ల కూర, పొటల్స్ కర్రీ రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications