Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
Potato Rice Recipe: ఎంతో రుచికరమైన ఆలు రైస్.. సులభంగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?
మీరు ఇప్పటి వరకు టమాటో రైస్, ఎగ్ రైస్ తిని ఉంటారు. అవి రుచికరంగా ఉండడంతో పాటు క్షణాల్లోనే తయారైపోతాయి. అయితే ఎప్పుడైనా బంగాళా దుంపలతో చేసుకున్న రైస్ తిన్నారా? ఇది అద్భుతమైన రుచి ఉండడంతో పాటు చాలా సులభంగా క్షణాల్లోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం చేసుకుంటే మూడు పూటలా కూడా ఈ పొటాటో రైస్‌ను తినొచ్చు.
దీని వల్ల అన్నం ఆదా అవడంతో పాటు మూడు పూటలా వంట చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం పది నిమిషాల్లో సిద్ధమైపోయే ఈ పొటాటో రైస్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధమైన పద్దతిలో ఈ పొటాటో రైస్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు
- బియ్యం - ఒక కప్పు
- బంగాళదుంప - ఒకటి
- ఉల్లిపాయ- 2
- వెల్లుల్లి
- గరం మసాలా పొడి
- సాంబార్ పొడి
- ఆవాలు
- జీలకర్ర
- ఎండు మిరపకాయలు
- కరివేపాకులు
- కొత్తిమీర
- నూనె
- రుచికి సరిపడా ఉప్పు
పొటాటో రైస్ తయారీ విధానం
ముందుగా మనం తీసుకున్న ఒక పెద్ద బంగాళాదుపంను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శెనగలు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
ఇప్పుడు అందులోనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బంగాళా దుంపలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆ బంగాళా దుంపలను ఒక అయిదు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమంలో కొంచెం గరం మసాలా, కొంచెం సాంబార్ పొడి వేసుకొని అన్ని మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకొని, చల్లారిన అన్నంను అందులో వేసుకొని బంగాళా దుంపల మిశ్రమం అన్నానికి పట్టుకునే విధంగా కలుపుకోవాలి. కావాలనుకుంటే అందులోనే టమోటా ముక్కలను కూడా వేసుకొని వండుకొవచ్చు. ఇది కూడా చాలా రుచికరంగా ఉంటుంది.
ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికాక కిందకు దించుకోవాలి. ఆ పొటాటో రైస్‌ను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే పొటాటో రైస్ సిద్ధమైనట్లే. దానిపై కొంచెం నిమ్మరసం పిండుకొని వేడివేడిగా పొటాటో రైస్‌ను ఎంజాయ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications