Latest Updates
-
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు
పోషకాలు నిండిన ప్రొటీన్ దోశ..రుచితో పాటు ఎనర్జీ కూడా.. చట్నీ లేకున్నా చాలా టేస్టీ..!
మామూలు దోశ తింటే రుచి మాత్రమే ఉంటుంది. అదే ప్రొటీన్ దోశ తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. మీ కోసం ఈ సారి ప్రొటీన్ దోశ రెసిపీని తీసుకొని వచ్చాము. ఇందులో ప్రొటీన్ పుష్కలంగా వుంటుంది. రోజుకు ఒక దోశను తింటే మీకు కావాల్సిన ప్రొటీన్లు అందుతాయ్. రుచిగా కూడా వుంటుంది. ఈ దోశలకు చట్నీలు కూడా అవసరం లేదు. మరి ప్రొటీన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ప్రొటీన్ దోశ కోసం కావాల్సిన పదార్ధాలను ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి.
ఒక కప్పు బ్రైన్ రైస్
అర కప్పు పచ్చి చెనగపప్పుఅర కప్పు పెసర్లు,
పావు కప్పు కంది పప్పు,
పావు కప్పు మినప్పప్పు,
పావు కప్పు పల్లీల,
ఉల్లిపాయు
రెండు పచ్చిమిరపకాయలు,
కొన్ని కరివేపాకులు,
సగం ఇంచు అల్లం ముక్కలు,
ఒక టీస్పూన్ మిరియాలు,
ఒక టీస్పూన్ జిలుకర
1 టేబుల్ స్పూన్ పచ్చి చెనగపప్పు,
1 టేబుల్ స్పూన్ మినపగుళ్లు,
10 ఎండిమిరపకాయలు,
1 పెద్ద ఉల్లిపాయ
6 వెల్లుల్లి ముక్కలు,
3 చిన్న క్యారెట్లు
ఒక పెద్ద టమాటా
తగినంత ఉప్పు, పసుపు
ప్రొటీన్ దోశను ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి.
1. ముందుగా ఒక గెన్నెలో ఒక బౌల్ బ్రైన్ రైస్‌ను తీసుకోవాలి. అర కప్పు పచ్చి చెనగపప్పు కూడా తీసుకోవాలి. అర కప్పు పెసర్లు, పావు కప్పు కంది పప్పు, పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు పల్లీలను కూడా వేసుకోవాలి. వీటన్నింటిలో నీళ్లు పోసి కడిగి, ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో దానికి 6 గంటల ముందుగానే నానబెట్టుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంటే రాత్రి సమయంలోనే నానబెట్టుకోవాలి.
2. నానబెట్టిన తరువాత వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి, సగం ఉల్లిపాయ ముక్కలతో కలిపి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు, సగం ఇంచు అల్లం ముక్కలు, ఒక టీస్పూన్ మిరియాలు, ఒక టీస్పూన్ జిలుకర వేసి తగినన్ని నీల్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3. గ్రైండ్ చేసిన పిండిని మొత్తం ఒక బౌల్లో వేసుకొని, అందులో రుచికి సరిపడ ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. 30 నిమిశాల వరకు మూత పెట్టి వదిలేయాలి.
4. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల మంచి నూనె వేసి వేడి చేసి. అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్లు, 10 ఎండిమిరపకాయలు, ఇవి బాగా వేగిన తరువాత 1 పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 6 వెల్లుల్లి ముక్కలు, 3 చిన్న క్యారెట్లను ముక్కలుగా కోసి వేసుకోవాలి. పావు కప్పు పచ్చి కొబ్బరను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
5. ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేసుకోవాలి, రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. పావు టీస్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టి టమాట ఉడికేంతవరకు చూడాలి. తరువాత ఈ మొత్తం చల్లారిన తరువాత మిక్సీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోపోప్ వేసుకుంటే చట్నీ రెడీ అయినట్టే.
6. ఇప్పుడు దోశలు వేసుకొవడానికి ప్యాన్‌పై ఒక టీస్పూన్ నూనె వేసి బాగా రాయాలి. తరువాత ఒక గరిటెతో పిండిని పోసుకొని దోశవేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోశను చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. రెండు వైపుగా కాల్చుకొని క్రిస్పీగా అయ్యేలా చూసుకోవాలి.
7. ఇలాగే అన్ని దోశలు వేసుకుంటే రెడీ అయినట్టే. ఈ ప్రొటీన్ దోశలకు చట్నీ లేకుండా కూడా తినవచ్చు. మనం చేసుకున్న క్యారెట్ చట్నీతో నంచుకొని తినండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications