Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మిగిలిపోయిన ఇడ్లీ పిండితో కరకరలాడే పునుగులు.. సింపుల్‌గా ఎలా తీసుకోవాలో తెలుసా?
చలికాలంలో కొంచెం కరకరలాడే ఫుడ్ తినాలని అనిపిస్తుంటుంది. అది కూడా చాలా రుచికరంగా ఉంటేనే బాగుటుందని అనుకుంటూ ఉంటాం. అయితే ఆ ఆహరం కోసం చలిలో ఎక్కడెక్కడో తిరగడం చాలా మందికి నచ్చదు. అయితే అలాంటి వారు ఇంట్లోనే కరకరలాడే పునుగులు చేసుకోవచ్చు. అదీ కూడా ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన ఈ స్నాక్ ఐటెంను సులభంగా చేసుకోవచ్చు. ఈ పునుగులను ఏ విధంగా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పునుగుల తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల ఇడ్లీ పిండి
- డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె
- రెండు పచ్చిమిర్చి
- పావు కప్పు ఉల్లిపాయలు
- అర టీ స్పూన్ జీలకర్ర
- సన్నగా తురుముకున్న అర అంగుళం అల్లం

పునుగులు తయారీ విధానం
- ఈ పునుగులను మనం ఇడ్లీ పిండితో చేస్తున్నాం కాబట్టి, చాలా సులభంగా, అలాగే తక్కువ సమయంలో అయిపోతుంది. ముందుగా రెండు కప్పుల ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అర టీస్పూన్ జీలకర్ర, అల్లం తురుము కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి.
- కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ పిండి మరీ లూజ్‌గా కాకుండా, పునుగులు వేసుకునే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. దానిపై కడాయి పెట్టి పునుగులు డీప్ ఫ్రై కావడానికి సరిపడా నూనె పోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండితో చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసుకున్న తరువాత మంటను మీడియంలో మాత్రమే ఉంచాలి. అలాంటప్పుడే పునుగులు అన్నీ వైపులా సమాంతరంగా కాలుతాయి.
- మీడియం మంటలోనే పునుగులు అంతా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై కానివ్వాలి. గోల్డెన్ కలర్లో వచ్చిన తరువాత వాటిని నూనెలో నుంచి తీసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా కలిపిపెట్టుకున్న పిండితో అన్ని పునుగులను వేసుకోవాలి. పునుగులు వేయడం పూర్తయ్యాకా వాటిని ఒక ప్లేట్లో తీసుకొని టమాటో చట్నీ లేకపోతే అల్లం చట్నీతో తింటే రుచి అమోఘంగా ఉంటుంది.
- క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ పంటికింద ఒక్కో పునుగు తగులుతుంటే.. నోట్లో నాలుక లాలాజలంతో నిండిపోతుందంతే. మీరు కూడా ఈ చలికాలంలో వేడి వేడిగా, కరకరలాడే ఈ పునుగులను మీ ఇంట్లోనే ఇడ్లీ పిండితో చేసుకొని ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. రుచి అదిరిపోతుంది అంతే.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications