Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కమ్మని రుచి, అద్భుతమైన సువాసన..నోట్లో వేస్తే కరిగిపోయే రబ్రీ..ఎలా చేసుకోవాలంటే..
మన సంస్కృతిలో స్వీట్లకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగైనా, ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యమైనా స్వీట్ ఉండాల్సిందే. భోజనం పూర్తయిన తర్వాత కాస్తంత తీపి తినడానికి మనలో చాలామంది ఇష్టపడతారు. అలాగే మన ఇంటికి ఎవరైనా బంధువులు లేదా స్నేహితులు వస్తే స్వీట్స్ తీసుకురావడం, భోజనం తర్వాత స్వీట్ వడ్డించడం ఒక అందమైన సంప్రదాయం.
అయితే, అనుకోకుండా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇంట్లో ఎలాంటి స్వీట్లు లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో పాలు ఉంటే చాలు, ఎంతో రుచికరమైన రబ్రీని చిటికెలో తయారు చేయవచ్చు. ఇంట్లో పాలు మిగిలిపోయినప్పుడు ఆ పాలను ఉపయోగించి కూడా కమ్మని రబ్రీని తయారు చేసుకోవచ్చు. ఇది చేయడం చాలా సులభం, పైగా దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇంట్లో చేసిన రబ్రీని రుచి చూశారంటే, మీ వేళ్లు మీరే నాకాల్సిందే. రబ్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-పంచదార
-డ్రై ఫ్రూట్స్(బాదం,జీడిపప్పు, పిస్తా)
-యాలకల పొడి
-కుంకుమ పువ్వు
రబ్రీ తయారీ విధానం
-ముందుగా మందపాటి అడుగు ఉన్న ఒక పెద్ద పాన్ లేదా కడాయిని తీసుకోవాలి. అందులో మీకు కావలసిన పరిమాణంలో పాలను పోసి వేడి చేయండి. స్టవ్ మంటను మీడియంలో ఉంచి పాలు అడుగున మాడిపోకుండా గరిటెతో కింద నుండి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి.
-పాలు మరుగుతున్నప్పుడు పైన మీగడ కడుతుంది కదా, ఆ మీగడను కడాయి అంచులకు రాస్తూ ఉండాలి. రబ్రీకి అసలైన రుచి, చిక్కదనం వచ్చేది ఈ మీగడ వల్లే.
-పాలు బాగా మరిగి చిక్కటి రబ్రీలా మారుతున్నప్పుడు స్టవ్ మంటను పూర్తిగా తగ్గించాలి. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా అందులో పంచదార వేసి, మంచి సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా కలపాలి.
-మీకు డ్రై ఫ్రూట్స్ రుచి ఇష్టమైతే, బాదం, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని సన్నగా తరిగి ఈ రబ్రీపై చల్లుకోవచ్చు. ఇవి రబ్రీకి మంచి క్రంచీ రుచిని ఇస్తాయి.
-రబ్రీ చూడటానికి లేత పసుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించాలంటే, పాలు మరుగుతున్నప్పుడే అందులో చిటికెడు కుంకుమపువ్వు వేయాలి. ఇలా తయారు చేసిన రబ్రీ.. మార్కెట్లో కొనే స్వీట్ కంటే ఎన్నో రెట్లు రుచిగా ఉంటుంది.
-తయారైన రబ్రీని మట్టి కుండలు లేదా చిన్న మట్టి గిన్నెలలో పోసి చల్లార్చాలి. చల్లటి రబ్రీని మట్టి కుండలో తింటే ఆ రుచికి ఆహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications