Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఇది తాగితే వేసవిలో బాడీ మొత్తం కూల్ అయిపోతుందట.. అది ఎలా చేసుకోవాలంటే?
వేసవిలో సాధారణంగానే ఎండలు భారీగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు భారీగా మండుతుంటాయి. ఈ ఉష్ణాన్ని తట్టుకోవాలంటే శరీరానికి చలువ చేసే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అలాంటి ఆహారాల్లో ముందుగా గుర్తొచ్చేది రాగి అంబలి. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే సాధారణమైన, ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు ఈ రాగి జావను రోజూ తీసుకుంటే విశేష ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ రాగి అంబలి ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు. అందుకే ఈ స్టోరీలో రాగి అంబలిని ఎలా చేసుకోవాలో వివరించాం. మీరు కూడా ఈ స్టోరీని పూర్తిగా వివరించాము. దీనిని మీరు ట్రై చేసి ఎలా ఉందొ కామెంట్ చేయండి.
రాగి అంబలి తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - 4 స్పూన్లు
ఉల్లిపాయ తురుము - 1 (చిన్నదిగా తరిగినది)
పెరుగు - అరకప్పు
నీళ్లు - 2 కప్పులు
కొత్తిమీర తురుము - 1 స్పూను
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం - స్టెప్ బై స్టెప్
ముందుగా, స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టి, రాగి పిండిని పొడి పిండిలా కొంచెం వేయించాలి. ఈ ప్రక్రియతో అంబలికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది.
వేయించిన రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని, అరకప్పు చల్లని నీళ్లు వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా ఒక ముద్దలా చేయాలి.
మరో గిన్నెలో ఒకటిన్నర కప్పు నీళ్లు మరిగించాలి. నీరు మరిగిన తర్వాత అందులో ఈ రాగి మిశ్రమాన్ని నెమ్మదిగా వేసుకుంటూ మిక్స్ చేయాలి.
చిన్న మంటపై ఈ మిశ్రమాన్ని నిరంతరం కలుపుతూ ఉడికించాలి. సుమారు 5 నిమిషాల వరకూ ఉడకనివ్వాలి.
జావ మిక్స్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత పెరుగు వేసి బాగా కలపాలి. అలాగే ఉప్పు కూడా రుచికి తగ్గట్టు చేర్చాలి.
చివరగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర కలిపి 5 నిమిషాలు పక్కన ఉంచితే రుచికరమైన రాగి అంబలి రెడీ!
రాగి అంబలి తాగడం వాళ్ళ ఆరోగ్యానికి కలిగే గ్యానికి లాభాలు
వేడి తగ్గిస్తుంది: వేసవిలో తినటానికి సరైన ఆహారం ఇది. ఇది తినడం వలన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకం నివారిస్తుంది.
డయాబెటిస్ నియంత్రణ: గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నిలుపుతుంది.
బరువు తగ్గించడంలో సహాయం: తక్కువ కాలరీలు, అధిక ఫైబర్ ఉన్న రాగి అంబలి, ఆకలి నియంత్రణలో ఉంచి, బరువు తగ్గే వారికి ఉపశమనంగా ఉంటుంది.
ఎముకల బలం పెరుగుతుంది: క్యాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జుట్టు సమస్యలపై లాభం: ఐరన్, జింక్ పుష్కలంగా ఉండే ఈ పానీయం జుట్టు పెరుగుదలకి, జుట్టురాలిని తగ్గించడానికీ ఉపయోగపడుతుంది.
చిన్న చిట్కా:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నం తేలికపాటి భోజనంగా రాగి అంబలిని తీసుకుంటే అన్నిటికంటే ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications