Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
చలికాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ రాగి బిస్కెట్స్ తినాలి.. ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?
మనకు ఆహారం అంటే చాలా ప్రియం. అందులో ముఖ్యమైనది స్నాక్స్. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఈ స్నాక్స్‌ను తింటుంటారు. అందులో బిస్కెట్స్, స్వీట్స్ ఉంటాయి. అయితే ఈ స్వీట్స్, బిస్కెట్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందులోని షుగర్ మన ఆరోగ్యాన్ని హాని చేసే ఛాన్సుంది. అందుకే ప్రతిరోజూ స్నాక్స్ తినాలనుకునే వారు రాగితో చేసిన బిస్కెట్స్ తినొచ్చు. ఇవి తినడం వల్ల ఆరోగ్యం లభించడంతో పాటు రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఈ రాగి బిస్కెట్లు ఏ విధంగా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాగి బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు రాగి పొడి
- అర కప్పు ఖాండ్
- అర టేబుల్ స్పూన్ పచ్చి ఏలకుల పొడి
- కొంచెం అల్లం పొడి
- ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా
- అర కప్పు బియ్యం నూనె
- ఒక కోడిగుడ్డు
- రుచికి సరిపడా ఉప్పు

రాగి బిస్కెట్స్ తయారీ విధానం
ముందుగా మనం తీసుకున్న ఒక కప్పు రాగి పొడిని తీసుకొని అందులో అర టేబుల్ స్పూన్ పచ్చి ఏలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక పెనంపై పేర్చి, కొంచెం కాలే వరకు రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక గుడ్డును తీసుకొని ఒక గిన్నెలో పగలగొట్టుకొని, గిలక్కొట్టుకోవాలి. ఇప్పుడు ఆ గుడ్డులో కాల్చి పెట్టుకున్న రాగి పొడిని, ఖాండ్‌ను వేసుకొని కలుపుకోవాలి. గుడ్డు మిశ్రమానికి ఖాండ్, రాగి రోస్ట్ సరిగ్గా కలిసే విధంగా కలుపుకోవాలి. అప్పుడే రుచి బాగుటుంది.
ఇప్పుడు ఎండు అల్లం పొడిని, రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం నూనె వేసుకొని మొత్తం మిశ్రమాన్ని మరోసారి కలుపుకోవాలి. ఆ మిశ్రమం కొంచెం డార్క్‌గా, ముద్దగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉండలను కొంచెం ఒత్తుతూ బిస్కెట్స్ షేప్‌లో వచ్చే విధంగా చేసుకోవాలి.
ఇప్పుడు బిస్కెట్లను ఒవేన్‌లో పెట్టుకొని అయిదు నుంచి ఏడూ నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ బిస్కెట్లపై బటర్ పేపర్‌ను ఉంచుకుంటే బిస్కెట్లు మాడిపోకుండా ఉంటాయి. ఆ బిస్కెలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం దూరం దూరంగా ఉంచుకోవాలి. అప్పుడే బిస్కెట్లు సరిగ్గా ఉడకడంతో పాటు, రుచికరంగా ఉంటాయి. 7 నిమిషాలు పూర్తయిన తరువాత ఒవేన్ బంద్ చేసి కుకీస్‌ని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకుంటే రాగి బిస్కెట్లు సిద్ధమైనట్లే.
రాగి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు రోగాలతో పోరాడేందుకు కావాల్సిన శక్తి అందుతుంది. అలాగే తక్షణ శక్తి అంది.. పని చేసేందుకు తగిన ఎనర్జీ లభిస్తుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications