Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ప్రొటీన్లతో ఫుల్ లోడైన రాగి లడ్డూలు.. టేస్టుకు టేస్ట్..బలానికి బలం..!
మన రోజూ వారి ఆహారంలో రాగి వంటకాలను భాగం చేసుకుంటే శరీరం చాలా ఆరోగ్యంగా వుంటుంది. రాగిలో ప్రొటీన్లు పుష్కలంగా వుంటాయన్న విషయం తెలిసిందే. దానితో పాటు రాగి వంటకాలు చేయడం చాలా సులభం కూడా. రాగికి సంబంధించిన ఏ వంటకం చేయాలన్నా 20 నిమిషాల నుంచి అర గంట సమయం మాత్రమే పడుతుంది. దాని కంటే ఎక్కువ సమయం తీసుకోదు.
రాగిలడ్డు చేయడానికి ప్యాన్‌లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. తరువాత దీంట్లో ఒకకప్పు వరకు రాగిపిండిని వేసి ప్యాన్‌లో బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే ఈ రాగిపిండిని కలుపుకోవాలి. రాగిలో వుండే పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూనే వుండాలి. పది నిమిషాల పాటు రాగిపిండిని అలాగే కలుపుతూ వుండాలి. బాగా ఫ్రై అయిన తరువాత రాగిపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి పావుకప్పు పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ వద్ద గనుక డ్రైఫ్రూట్స్ వుంటే పల్లీలకు బదులుగా డ్రైఫ్రూట్స్ ఉపయోగించవచ్చు. నాలుగు నుంచి 5 నిమిశాల వరకు వీటిని ప్యాన్‌పై ఫ్రై చేస్తూనే వుండాలి. ఒక వేళ మీరు ప్యాన్‌లో పల్లీలు వేస్తే పల్లీలపై వున్న పొట్టును మొత్తం తీసివేయాలి. పొట్టు తీసేసిన పల్లీలను ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే లడ్డూలు బాగా అవుతాయ్.

గ్రైండ్ చేసిన పల్లీల పొడిని అంతకు ముందు ఫ్రై చేసి రెడీ చేసుకన్న రాగిపిండిలోకి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడంత ఉప్పును వేసుకోవాలి. లడ్డూలు బాగా రావడానికి అరటీస్పూన్ యాలాకుల పొడిని వేసుకోవాలి. లడ్డూలు తయారు చేయడానికి రాగిమిక్స్ను రెడీ చేసుకున్నాం.
మళ్లీ ప్యాన్‌ను స్టవ్‌పైన పెట్టుకొని అరకప్పు బెల్లంముక్కలను ప్యాన్‌లో వేసుకోవాలి. అందులో పావుకప్పు నీళ్లువేసి బెల్లాన్ని బాగా మరిగించాలి. పాకం మొత్తం ముదరకుండా లేతగా వచ్చేలా చూసుకోవాలి. లేదంటే రాగిలడ్డూలు సరిగ్గా చేయడం సాధ్యం కాదు.
ఇప్పుడు బెల్లం పానకాన్ని ఒక చిన్న బౌల్లోకి వడకట్టుకోవాలి. చిన్న బెల్లం ముక్కలు కూడా రాకుండా జాగ్రత్తపడాలి. వడకట్టుకున్న పాకాన్ని రాగిమిక్స్ లో వేసుకోవాలి. పాకాన్ని రాగిమిక్స్ను రెండింటినీ బాగా కలుపుకున్న తరువాత ఆ పిండిని ఒక పదినిమిషాల వరకు అలాగే వదిలివేయాలి. పిండి కొంచెం వేడిగా వున్నప్పుడు లడ్డూలు చేయడం ప్రారంభించాలి. పిండి చల్లారిన తరువాత లడ్డూలు చేయడం సాధ్యం కాదు. చాలా సులభంగా ఈ లడ్డూలను చేసుకోవచ్చు. దీంతో రాగి లడ్డూలు రెడీ అయినట్టే. ఈ తియ్యని బెల్లం రాగి లడ్డూలు చాలా టేస్టీగా వుంటాయ్.
రాగి లడ్డూలో పోషకాలు..
రాగి లడ్డూల్లో ఐరన్‌లో పాటు క్యాల్షియం మెండుగా వుంటుంది. రక్తహీనతతో బాధపడేవారు ప్రతి రోజు ఒక రాగిలడ్డును తినడానికి ప్రయత్నించాలి. షుగర్ లెవెల్స్‌ను కూడా రాగి లడ్డులు అదుపు చేస్తాయ్. ప్రొటీన్ కంటెంట్ కూడా ఈ రాగి లడ్డులో మెండుగా వుంటుంది. ఈ రాగి లడ్డుల వల్ల జీర్ణప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా రాగి లడ్డూలో పుష్కలంగా వుంటాయ్. డెలివరీ తరువాత కూడా తల్లులకు కోలుకోవడానికి చాలా దోహదపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications