Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
రాగి పిండితో పకోడీలు ఎప్పుడైనా చేసుకున్నారా..? రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం..!
మధ్యాహ్నం లంచ్ చేసిన తరువాత నిద్రపోయి లేచి లేదంటే వీకెండ్లో సాయంత్రం ఏం తినాలో తోచనప్పుడు మన ముందు పకోడీలు వుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. అది ఎలాంటి పకోడీ అయినా మంచి టైమ్ పాస్ అవుతుంది. ఉల్లిపాయ పకోడీ, పాలకూర పకోడి, చికెన్ పకోడీ, ఇలా చాలా రకాల పకోడీలను టేస్ట్ చేశాము. కానీ రాగిపకోడీని ఎప్పుడైనా టేస్ట్ చేశారు ?. రాగి అంబలి, రాగి దోశను తిని వుంటాము. కానీ రాగి పకోడీలను చాలా తక్కువ మంది చేసుకుంటారు.
రాగి పిండితో మనకు తెలియని ఎన్నో రెసిపీలు వున్నాయ్. రాగిలో పోషకాలు మెండుగా వుంటాయన్న విషయం తెలిసిందే. రాగి అనగానే కేవలం రాగి అంబలి, రాగి సంగటి మాత్రమే కాదు రాగి పకోడీ లాంటి టేస్టీ వంటకాలు కూడా వున్నాయన్న విషయాన్ని మరవద్దు. రాబోయే రోజుల్లో రాగితో మరిన్ని వంటకాలు వస్తాయ్. ఇప్పటికైతే మీకు రాగి పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో అందిస్తున్నాం.
రాగి పకోడీని తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట సామాగ్రి
రాగిపిండి, ఉల్లిపాయలు, మంచి నూనె, ఉప్పు, బియ్యపు పిండి, పల్లీలు, పుట్రాలు, పచ్చి మిరపకాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకులు, సోంప్, ఇంగువ, పసుపు, కారంపొడి.
రాగి పకోడీని తయారు చేసుకునే విధానం
రాగి పకోడీని తయారు చేసుకోవడానికి రెండు పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి ఒక బౌల్లో వేసుకోవాలి. దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోవాలి. తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు కప్పుల రాగిపిండిని బౌల్లో వేసుకోవాలి. అరకప్పు బియ్యపు పిండిని కూడా వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి. పావు కప్పు పుట్నాలను కూడా వేసుకోవాలి. మూడు పచ్చి మిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి.
బౌల్లో కొంచెం కొత్తిమీర కరివేపాకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ సోంప్ వేసుకోవడం వల్ల పోకడీ బాగా టేస్టీగా వస్తుంది. పావు టీ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, అర టీస్పూన్ కారంపొడిని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బౌల్లో బాగా మారినేట్ చేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని రాగిపిండిని బాగా కలుపుకోవాలి. పకోడీలు వేసే విధంగా నీళ్లు పోసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి.
ఇప్పుడు పకోడీలు వేయించడానికి కడాయిని స్టవ్‌పైన పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టి తగినంత ఆయిల్‌ను పోసుకోవాలి. రాగి పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని కడాయిలోని నూనెలో వేయించాలి. గోల్డెన్ కలర్లో పకోడీలు వచ్చేంత వరకూ వేయించుకోవాలి. పకోడీలు మాడిపోకుండా జాగ్రత్తపడాలి.
నూనె కాగేంతవరకే హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. పకోడీలు వేయిస్తున్నంతసేపు స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. పకోడీలు వేయించిన తరువాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక దీంతో రాగిపిండి పకోడీ రెడీ అయినట్టే.
రెగ్యులర్‌గా తినే పకోడీలకు, రాగి పిండి పకోడీలకు చాలా తేడా వుంటుంది. నూనెలో పకోడీలను వేయించుకునేటప్పుడే వెడల్పుగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయ్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












