Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బల్లగుద్ది చెప్తున్నా.. ఇలాంటి టీ మీరు జన్మలో తాగి ఉండరు,ప్రయోజనాలు మాత్రం అదుర్స్, ఎలా చేసుకోవాలంటే?
మీరు ఇప్పటి వరకు చాలా రకాల టీలు తాగి ఉంటారు. సాధారణ టీ, అల్లం టీ, గ్రీన్ టీ, బెల్లం టీ.. ఇలా ఎన్నో రకాల టీలను రుచి చేసి ఉంటారు. కానీ మీరెప్పుడైనా రోజ్ టీ తాగారా?. మీలో చాలా మంది చెప్పే సమాధానం నో. అయితే ఈ టీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్యూటీ ప్రొడక్ట్స్‌తో వాడే రోజ్‌తో టీ చేసుకొని తాగడం వలన ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా మేలు జరుగుతుంది. ఇంతకీ ఈ రోజ్ టీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనే దానితో పాటు.. ఈ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
తాజా గులాబీ రేకులు: 1 కప్పు
నీరు: 2 కప్పులు
తేనె లేదా చక్కెర: రుచికి సరిపడా
నిమ్మరసం: కొన్ని చుక్కలు
టీ ఆకులు

తయారీ విధానం:
ఈ రోజ్ టీ తయారు చేసుకోవడానికి ముందుగా గులాబీ రేకులను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అందులో ఏమైనా పురుగులు లేదా రసాయనాలు ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. ఆ తరువాత ఆ గులాబీ రేకులను ఓ గిన్నెలో తీసుకొని బాగా నీరు పోసుకొని మారగించుకోవాలి. ఒకవేళ మీకు టీ ఆకులు కావాలనుకుంటే.. గులాబీ రేకులతో పాటు టీ ఆకులు కూడా వేసుకొని మరించుకోవచ్చు.
అలా మరిగిన తరువాత.. ఆ నీటిని వడగట్టి ఓ గ్లాసులో తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా చెక్కెర(కావాలనుకున్న వాళ్ళు తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు), కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఆ టీని ఆస్వాదించడమే. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.
రోజ్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు:
రోజ్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అలాగే రోజ్ టీ చర్మాన్ని తేమగా ఉంచడానికి, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో పాటు ఇది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్ర పట్టే విధంగా సహాయపడుతుంది. రోజ్ టీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అలాగే మానసిక ఆరోగ్య స్థితిని మెరుగుపరుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications