Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మిగిలిపోయిన ఇడ్లీతో ఈ రొట్టెలు చేసుకోండి,టేస్ట్ అదిరిపోతుంది, ఎలా చేసుకోవాలంటే?
సాధారణంగా ఎక్కువ మంది ఇంట్లో ఉదయాన్నే ఉండే బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది ఇడ్లీ. దీనిని సులభంగా చేసుకోవడంతో పాటు ఖర్చు కూడా తక్కువగా ఉండడంతో ఎక్కువగా ఇడ్లీలు చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో పిండి మిగిలిపోతే, వాటిని పారేస్తుంటారు. అయితే ఈసారి మీరు ఇడ్లీ చేసుకునేటప్పుడు పిండి మిగిలిపోతే, ఆ పిండితో ఈ విధంగా కొబ్బరి రొట్టెలు తయారు చేసుకోండి. చాలా సులభమైన పద్దతిలో దీనిని చేసుకోవచ్చు. ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. అయితే దీనిని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొబ్బరి రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ పిండి - 2 కప్పులు
పచ్చి కొబ్బరి - ఒక కప్పు
పావు కప్పు బెల్లం
సరిపడా నూనె లేదా నెయ్యి

కొబ్బరి రొట్టెలు తయారీ విధానం
మిగిలిపోయిన ఇడ్లీ పిండితో రొట్టెలు వేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. అలాగే అందులో కొబ్బరి తురుమును కూడా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. అలాగే అందులోనే బెల్లాన్ని కూడా పొడిగా చేసుకొని అందులో వేసుకోవాలి.
ఇప్పుడు ఆ పిండిని బెల్లం, కొబ్బరి పొడి, బెల్లం పొడి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఓ పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని, దానికి కింద నెయ్యి పూసుకోవాలి. ఇప్పుడు అందులోనే కాస్త మందంగా పిండిని పోసుకోవాలి. ఆ తరువాత సన్నటి మంట మీద ఆ రొట్టెను 5 నుంచి పది నిమిషాల పాటు బాగా కాలనివ్వాలి. అప్పుడే రొట్టె లోపలి భాగం కూడా బాగా కాలుతుంది. అలా రెండు వైపులా రొట్టెను కాల్చుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి రొట్టె సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications