Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
సింపుల్ టేస్టీ సాంబార్ చేసుకుందామా..!
సాంబార్ అనగానే మనకు నోటిలో లాలజాలం పొంగుకొస్తుంది సింపుల్ డిష్ ఏ అయినా రుచికరమైన సాంబార్ ను ఇష్టపడనివారు ఎవరుంటారు. సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలో మీకు వివరించబోతున్నాం. ఇంట్లో వున్న వంట వస్తువులతోనే టేస్టీ సాంబార్ ను చక చకా రెడీ చేసుకోవచ్చు.
సాంబార్‌ను తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట వస్తువులు..
సాంబార్ పౌడర్, కంది పప్పు, ఉల్లిగడ్డ, కూరగాయలు (క్యారెట్, మునక్కాయ, టమాట, బెండకాయ), పోప్ వస్తువులు, నూనె, నెయ్యి
1 . ఉపయోగించిన పప్పును బట్టే సాంబార్ రుచి ఉంటుంది. ఒక కప్పు కంది పప్పు తీసుకొని బాగా కడిగి కుక్కర్ లో కందిపప్పును వేసి రెండు కప్పుల నీళ్లు పోసి పప్పును బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత ఆ పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
2. సాంబార్లో వేయాలనుకుంటున్న కూరగాయలాన్నింటిణీ కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, మునక్కాయ, బెండకాయ, టమాటా ను కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ప్యాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ ను వేసుకోవాలి. ముందుగా కోసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంత ఫ్రై చేసుకోవాలి. మిగిలిన అన్ని కూరగాయాలను కూడా వేసుకొని ఒక సారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారంపొడిని వేసుకొని కోరగాయలాన్నింటినీ బాగా కలుపుకోవాలి.
3. రెండు నిమిషాలపాటు కూరగాయలు ఉడికిన తరువాత 5 కప్పుల నీళ్ల ని యాడ్ చేసుకోవాలి. కూరగాయాలని నీలల్లో బాగా ఉడకానివ్వాలి. ఇప్పుడు చింతపండు నాన బెట్టడానికి కొన్ని నీళ్ళని ఉడుకుతున్న కూరగాయల ప్యాన్ నుంచి తీసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల చింతపండును తీసుకొని ఈ ఉడికిన కొన్ని నీలల్లో నానబెట్టుకోవాలి.
4. తరువాత దాంట్ చిటికెడు పుసుుపును వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల సాంబార్పొడిని తగినంత ఉప్పును వేసుకోవాలి. ఆరు నుంచి 7 నిమిషాల సాంబార్‌ను బాగా ఉడికించాలి. నానబెట్టుకున్న చింతపండు రసాన్ని సాంబార్లో పిండుకోవాలి. మీకు చింత పండు రసం ఎంత కావాలనుకుంటున్నారో అంత మాత్రమే వేసుకోండి. ఎక్కువ వేయడం వల్ల టేస్టు కూడా సరిగ్గా రావపోవచ్చు. ఇప్పుడు రుబ్బుకున్న పప్పును ఇందులో వేసుకోవాలి. మొత్తం సాంబార్, పప్పును కూరగాయలను సాంబార్ గరిటెతో బాగా కలుపుకోవాలి.
5. సాంబార్‌ను బాగా మసలనివ్వాలి. మసులుతున్నప్పుడే అందులో కొత్తిమీర ఆకులను వేయాలి. ఇప్పుడు పోప్ రెడీ చేసుకోవడానికి ఒక ప్యాన్‌ను స్టవ్‌పై పెట్టుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. జిలకర, ఆవాలు, ఎండిమిరపకాయలు, కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరుగుతున్న సాంబార్‌ను పోప్లో వేసుకోవాలి. ఇక దీంతో సాంబార్ రెడీ అయినట్టే. సాంబార్ కొంత బాగా మరిగేవరకు ఆగాలి. ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగా వస్తుంది.
6. చేసుకున్న సాంబార్‌ను ఎక్కువ రోజులు తినాలను మీరు అనుకుంటే ఈ సాంబార్‌ను కొన్ని చిన్న బౌల్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. సాంబార్ తినాలనుకున్నప్పుడు వేడిచేసుకుంటే సాంబర్ ఫ్రెష్‌గా వుంటుంది. మొత్తం సాంబార్‌ను ఒకే బౌల్లో పెట్టి ఫ్రీజ్ చేస్తే టేస్టు మారే అవకాశం వుంది. మార్కెట్లో రకరకాల సాంబార్ పౌడర్లు వున్నాయ్. సాంబార్ టేస్టు సాంబార్ పౌడర్‌ను బట్టి కూడా వుంటుది. కాబట్టి మంచి బ్రాండెడ్ సాంబార్ పౌడర్‌ను మాత్రమే తీసుకోవాలి.
ఇక పోషకాల విషయానికి వస్తే.. రెండు కప్పుల సాంబార్లో 206 క్యాలరీలు వుంటాయ్. ప్రొటీన్లు 14 గ్రాములు వుంటాయని పోషకనిపుణులు చెబుతున్నారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












