Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఇలా సేమియా వడ ఎప్పుడైానా చేసుకున్నారా ? కరకరగా..టేస్ట్ కొత్తగా..!
సేమియాతో ఉప్మా చేసుకుంటాం, పాయసం చేసుకుంటాం, కానీ ఇలా సేమియా వడ ఎప్పుడైనా చేసుకున్నారా. ఇవి చాలా టేస్టీగా వుంటాయ్. చాలా తక్కువ మంది ఈ రెసిపీని చేసుకుంటారు. సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో మీకు అందిస్తున్నాం. ఇంట్లో వున్న పదార్ధాలతోనే చాలా సింపుల్‌గా ఈ సేమియా ఉప్మాను రెడీ చేసుకోవచ్చు. దీని కోసం బయట నుంచి ప్రత్యేకమైన పదార్ధాలు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. దీనికి ముఖ్యంగా కావాల్సింది, సేమియా, ఉప్మా రవ్వ, పుల్లటి పెరుగు, నిమ్మరసం, బియ్యపు పిండి, క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జిలుకర, ఉప్పు, మంచి నూనె. సేమియా ఉప్మా తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు.

సేమియా వడ కోసం కావాల్సిన పదార్థాలు
అర కప్పు సేమియా
అర కప్పు ఉప్మా రవ్వ
పావు కప్పు పుల్లటి పెరుగు
. ఒక స్పూన్ నిమ్మరసం
ఒక టీ స్పూన్ బియ్యపు పిండి
1 టేబుల్ స్పూన్ క్యారెట్
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము
కట్ చేసిన ఒక ఉల్లిపాయ
1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు
3 పచ్చిమిరపకాయ ముక్కలు
అర టీస్పూన్ జిలుకర, రుచికి సరిపడ ఉప్పు
మంచి నూనె
సేమియా వడ తయారు చేసే విధానం
1. ప్యాన్‌లో అర కప్పు సేమియా వేసుకొని ఫ్రై
చేసుకోవాలి.
2. మీడియం ఫ్లేమ్‌లో వీటిని 2నిమిశాలు ఫ్రై చేయాలి.
3. ఇందులో అర కప్పు ఉప్మా రవ్వను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
4. వీటిని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని పావు కప్పు పుల్లటి
పెరుగును యాడ్ చేయాలి.
5. ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయాలి.
6. కొన్ని నీళ్లు పోసుకొని సేమియాను పలుచగా కలపాలి.
7. బౌల్‌కు మూతపెట్టి 30 నిమిశాల వరకు సేమియాను
నానబెట్టాలి.
8. సేమియా సాఫ్ట్‌గా అయిన తరువాత ఒక టీ స్పూన్ బియ్యపు
పిండిని యాడ్ చేసుకోవాలి.
9. 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము,
10. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము వేసుకోవాలి.
11. కట్ చేసిన ఒక ఉల్లిపాయను కూడా వేసుకోవాలి.
12. 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు.
13. 3 పచ్చిమిరపకాయ ముక్కలు,
14. అర టీస్పూన్ జిలుకర, రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా
కలుపుకోవాలి.
15. బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను యాడ్ చేయాలి.
16. ప్యాన్‌లో 2 టేబల్ స్పూన్ల మంచి నూనెను వేసుకోవాలి.
17. చేతిలి పిండిని తీసుకొని బాల్ సైజులో తయారు చేసుకోవాలి.
18. ప్యాన్‌లో పిండిని వేసి స్లోగా ప్రెస్ చేయాలి.
19. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని
ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్త పడాలి.
20. 3 నుంచి 4 నిమిశాల వరకు కాల్చాలి.
21. రెండు పక్కల బాగా కాల్చి ప్లేట్ లోకి తీసుకోవాలి.
22. ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా
బాగుంటాయ్.
23. దీంతో సేమియా వడ రెడీ అయినట్టే.
ఈ సేమియా వడ అటు టిఫిన్‌లా, ఇటు సాయంత్రం స్నాక్స్ లా చేసుకోవచ్చు. సేమియా ఉప్మాలో కొవ్వు పదార్ధాలు కూడా ఎక్కువ లేవు కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎటువంటి భయం అవసరం లేదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
