Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
తియ్యగా, క్రంచీగా వుండే శక్కర్ పార..20 నిమిశాల్లో రెడీ..!
శక్కర్ పారను ఈసారి స్వీట్ షాపు లోంచి కొనుక్కోకుండా మనమే ఇంట్లో తయారు చేసుకుందాం. శక్కర్ పారకోసం ఎక్కువ వంట పదార్ధాలు కూడా అవసరం లేదు. బెల్లం, పాలు, గోదుమపిండి, నెయ్యి, బొబాయ్ రవ్వ, యాలాకుల పొడి, మంచి నూనెను వుంటే శక్కర్ పార సింపుల్‌గా రెడీ అయిపోతుంది. శక్కర్ పారను ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం.

శక్కర్ పారను తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు ఇవే :
అరకప్పు వరకు తురిమిన బెల్లం
కాచిన పావు కప్పు పాలు
రెండు కప్పుల గోదుమ పిండి
చిటికెడు ఉప్పు
2 టుబల్ స్పూన్ల బొంబాయ్ రవ్వ
రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి
అరటీస్పూన్ యాలాకుల పొడి
మంచి నూనె

శక్కర్ పారను ఈ విధంగా సింపుల్‌గా రెడీ చేసుకోండి
1. ముందుగా ఒక బౌల్లో అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. కాచిన పావు కప్పు పాలను పోసుకోవాలి. పాలకు బదులుగా నీళ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు.
2. ఈ మొత్తం మిశ్రమం కరిగిపోయిన తరువాత వాటిని మరో బౌల్లో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల ఏవైనా నార, చిన్న చెత్తపదార్థాలు వుంటే తొలగిపోతాయ్. మరో బౌల్లోకి రెండు కప్పుల గోదుమ పిండిని తీసుకోవాలి. రుచికి సరిపడ చిటికెడు ఉప్పు, 2 టుబల్ స్పూన్ల బొంబాయ్ రవ్వను యాడ్ చేసుకోవాలి.
3. పోప్ గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా వేడి చేయాలి. నెయ్యికి బదులుగా నూనెను కూడా తీసుకోవచ్చు. ఈ నెయ్యిని గొదుమ పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యిని సరిపడినంత కలుపుకున్నప్పుడు మాత్రమే మనకు పిండి బాగా కలుస్తుంది.
4. చేతిలో పిండిని తీసుకుంటే ఒక ముద్దలాగా రావాలి. ఇప్పుడు బల్లం కరిగించిన పాలను కూడా పిండిలో పోసుకొని కలుపుకోవాలి. రుచికోసం అరటీస్పూన్ యాలాకుల పొడిని యాడ్ చేసుకోవాలి. పిండి చపాతీ పిండిలా కావడానికి కొన్ని కొన్ని పాలను పోసుకొని కలుపుకోవాలి.
5. పిండిని మరీ గట్టిగా, పలుచగా కాకుండా సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తరువాత మూత పెట్టి 10 నిమిశాల వరకు పక్కన పెట్టండి.
6. ఇప్పుడు పిండిని సగానికి తీసుకొని బాగా రోల్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. రోల్ చేసేటప్పుడు మరీ సన్నగా, మరీ మందంగా కాకుండా రోల్ చేయాలి. స్వేర్ షేపులో వీటిని కట్ చేసుకోవాలి. డైమండ్ షేపులో కూడా వీిని కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
7. కట్ చేసిన శెక్కర్ పారను ఫ్రై చేయడానికి కడాయిలో తగినంత ఆయిల్‌ను వేడి చేసుకోవాలి. తరువాత శక్కర్ పారను వేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడి కాకుండా చూసుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తపడాలి.
8. శెక్కర్ పారను హై ఫ్లేమ్‌లో కాకుండా కవలం మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే లోపల పిండి అలాగే వుంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. మంచి గోదుమ రంగులోకి వచ్చాక శక్కర్ పారను ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక దీంతో శెక్కర్ పారను రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications