Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
టేస్టీ సోయా కట్‌లెట్.. మిల్ మేకర్లతో వెరైటీ స్నాక్.. రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారంతే..!
మిల్‌మేకర్లతో కర్రీ కొంతమందికి చాలా బోర్ కొడుతుంది. కానీ అదే మిల్ మేకర్లతో టేస్టీ కట్‌లెట్‌ను చేసుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఎక్కువ వంట సామాగ్రికూడా అవసరం లేదు. కేవలం మిల్ మేకర్లు, బియ్యం పిండి, మైదా పెండి, నూనె, తరుమిన బ్రెడ్ పొడి, కారం, పసుపు, ఉప్పు అల్లంవెల్లులల్లి పేస్టు, ఉల్లిపాయలను ఇంకా చిన్న పదార్ధాలు వుంటే సరిపోతుంది. మరి మిల్ మేకర్ కట్‌లెట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

సోయా కట్‌లెట్ కోసం కావాల్సిన పదార్ధాల లిస్ట్ మీ ముందు వుంచుతున్నాం. ఇవి దాదాపు అందరి ఇళ్లల్లో వుంటాయ్. వీటి కోసం ప్రత్యేకంగా మార్కెట్‌కు వెళ్లనవసరం లేదు.
2 కప్పుల వేడి నీళ్లు
ఉప్పు
1 కప్పు మిల్ మేకర్లు
సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ
ఫ్రెష్‌గా దంచిన ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
2 టీస్పూన్ల కొత్తిమీర ఆకులు
ొక టీస్పూన్ కారంపొండి
పావు టీస్పూన్ పసుపు
అర టీస్పూన్ ధనియాల పొడి
ముప్పావు టీస్పూన్ గరం మసాలాపొడి
ఉడకబెట్టిన రెండు ఆలుగడ్డలు
2 టీస్పూన్ల బియ్యం పిండి
మంచినూనె
పావుకప్పు మైదాపిండి
తురిమిన బ్రెడ్ పొడి
పచ్చిమిరపకాయలు
టమాటసాస్

సోయా కట్ లెట్‌ను ఈ కింది విధంగా చాలా
సింపుల్‌గా తయారు చేసుకోవాలి.
1. ముందుగా ఒక బౌల్‌లోకి రెండు కప్పుల వేడి నీళ్లను తీసుకోవాలి. ఇందులోనే అరటీస్పూన్ ఉప్పును తీసుకొని బాగా కలపాలి. అందులోనే ఒక కప్పు వరకు మిల్‌మేకర్లను వేసుకోవాలి. 10 నిమిశాల వరకు ఈ మిల్‌మేకర్లను వేడి నీళ్లల్లో నాననివ్వాలి.
2. వేడి నీళ్లల్లో బాగా నానిన తరువాత వాటిని బాగా పిండి ఆ మెత్తని మిల్‌మేకర్లను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీ మెత్తని మిల్‌మేకర్లను మిక్సీ జార్‌లో బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.
3. మిక్సింగ్ బౌల్‌లో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఫ్రెష్‌గా దంచిన ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును, రెండు టీస్పూన్ల కొత్తిమీర ఆకులను, ఒక టీ స్పూన్ కారంపొడిని, పావు టీస్పూన్ పసుపును, అర టీస్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడ ఉప్పును, ముప్పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి.
4. రెండు ఉడకబెట్టి మెత్తగా చేసిన ఆలుగడ్డను ముద్దను కూడా ఇందులోనే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, లేదంటే కార్న్ ఫ్లోర్‌ను వేసుకోవాలి. ఈ మొత్తాన్నీ బాగా కలపాలి. ఇప్పుడు చిన్న బాల్స్ చేసుకొని వడలాగా వత్తి కట్‌లెట్ షేపులో చేసుకోవాలి.
5. కలిపిన పిండి మొత్తాన్నీ కట్‌లెట్ షేపులో చేసుకోవాలి. వేరే గిన్నెలో పావు కప్పు మైదాపిండిని తీసుకోవాలి. ఇందులోనే కొన్ని నీళ్లను పోసి బాగా కలుపుకోవాలి. కట్‌లెట్‌లో కోటింగ్ చేసే విధంగా కలుపుకోవాలి. కట్‌లెట్‌లు ఫ్రై చేసేటప్పుడు విరిపోకుండా వుండడానికి కట్‌లెట్లను ఇందులో ముంచి తీసి తురిమిన బ్రెడ్ పొడిలో వేసి బయటకు తీసుకోవాలి.
6. ఇప్పుడు తురిమిన బ్రెడ్ లో డిప్ చేసిన కట్‌లెట్‌ను కడాయిలో కాగుతున్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. కట్‌లెట్ రెండు పక్కల కూడా మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇక దీంతో సోయా కట్‌లెట్‌లు రెడీ అయినట్టే.
7. టమాట సాస్ లేదంటే ఒక పక్క చాయ్ తాగుతూ కూడా వాటిని సాయంత్రం స్నాక్స్‌లా తినవచ్చు. కొన్ని పచ్చిమిరపకాయలను ఫ్రై చేసి నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
