Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రెగులర్ చికెన్ కర్రీ కాకుండా.. గ్రేవీ బాగా వున్న ఈ స్పెషల్ చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం అదుర్స్..!
రెగులర్‌గా చికెన్ కర్రీ కాకుండా ఈ సారి స్పెషల్‌గా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మీముందు వుంచాం. నార్మల్‌గా ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కొంచెం వేరుగా ప్రత్యేకంగా ఈ రెసిపీ వుంటుంది. మరి ఈ స్పెషల్ చికెన్ కర్రీని ఎలా తయీరు చేయాలో తెలుసుకోండి.

స్పెషల్ చికెన్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు
1 కేజీ చికెన్
ధనియాలు, నల్ల మిరియాలు, జిలుకర, సాజీర, యాలాకులు, దాల్చిన చెక్క,
లవంగాలు, బిర్యానీ ఆకులు
ఎండిమిరపకాయలు
10 బాదాంలు, 1 టీ స్పూన్ నువ్వులు
5 మీడియంసైజు ఉల్లిపాయలు
3 టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు
6 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు
3 మీడియం సైజు టమాటలు
ఉప్పు, పసుపు, కారంపొడి
కొత్తిమీర ఆకులు

స్పెషల్ చికెన్ కర్రీ తయారు చేసే విధానం
1. 1 కేజీ చికెన్‌ను బాగా కడిగి పక్కకు పెట్టుకోవాలి.
2. ఒక ప్యాన్‌లో కూరకు తగినన్ని ధనియాలు, జిలుకర, నల్ల
మిరియాలు, సాజీర, యాలాకులు, దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా
బిర్యానీ ఆకు వేసుకోవాలి.
3. ఎండిమిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
4. 10 బాదాంలను, 1 టీస్పూన్ నువ్వులను వేసుకొని బాగా కలుపుకోవాలి.
5. ఈ మొత్తాన్ని గ్రైండర్‌లో పౌడర్‌గా గ్రైండ్
చేసుకోవాలి.
6. ఒక కడాయ్‌లో తగినంత నూనె పోసుకొని అందులో 5 మీడియం సైజు
ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి.
7. కడిగిన చికెన్‌ను కడాయ్‌లో వేసుకొని బాగా
కలుపుకోవాలి.
8. స్టవ్ లోఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చివాసన
పోయేంతవరకూ కలుపుకోవాలి.
9. 3 టీ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి.
10. మిగిలిన ఇంగ్రీడియంట్స్ దీనిలో యాడ్ చేసుకోవాలి.
11. కడాయ్‌లో 6 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులను వేసి
బాగా మిక్స్ చేసుకోవాలి.
12. 3 టమాటాలను చిన్నగా కట్ చేసుకొని కూరలో వేసుకోవాలి.
13. రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారంపొడిని వేసుకోవాలి.
14. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే కూరను
బాగా కలుపుకోవాలి.
15. గ్రైండ్ చేసిన పౌడర్‌ను కూడా కూరలో వేసుకొని బాగా
కలుపుకోవాలి.
16. గ్రేవీ కోసం 2 గ్లాసుల నీళ్లను కూరలో పోసుకోవాలి.
17. చికెన్ ఉడికిందాలేదా ఒకసారి చెక్ చేసుకోవాలి.
18. కొన్ని కొత్తిమీరలు వేసి బాగా ఫ్రై అయ్యేలా చేయాలి.
19. ఇక దీంతో స్పెషల్ చికెన్ కర్రీ సర్వ్ చేయడానికి తయారైనట్టే..
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications