Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
స్ట్రీట్ స్టైల్‌లో చికెన్ నూడుల్స్ చేసుకోవడం చాలా ఈజీ.. రెస్టారెంట్‌కు కూడా వెళ్లనవసరం లేదు..!
స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడుల్స్ చాలా టేస్టీగా వుంటాయ్. ఇంట్లో చేసుకున్న నూడుల్స్‌కు బయట చేసిన నూడుల్స్‌కు చాలా వ్యత్యాసం వుంటుంది. స్ట్రీట్‌స్టైల్‌లో నూడుల్స్‌ను ఎలా తాయారు చేయాలో మీ ముందుకు తీసుకొని వచ్చాం. కేవలం ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.

చికెన్ నూడుల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు
1 నూడుల్స్ రోల్స్
ఉప్పు
1 టేబుల్ స్పూన్ మంచి నూనె
200 గ్రాముల బోన్‌లెస్ చికెన్
1 టేబుల్ స్పూన్ కారం పొడి
1 టీస్పూన్ అల్లం పేస్టు
2 టేబుల్ స్పూన్ల మైదపిండి
2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్
2 టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్టు
1 పచ్చి మిర్చి, 1 ఉల్లిపాయను
1/4 కప్పు సన్నగా తరిగిన క్యాప్సికం, 1/2 కప్పు సన్నగా తరిగిన
క్యారెట్
1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1. 1/2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ
సాస్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్
1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసి బాగా
కలుపుకోవాలి.

చికెన్ నూడుల్స్ తయారు చేసుకునే విధానం
1. ముందుగా మరుగుతున్న నీళ్లల్లో 1 నూడుల్స్ రోల్ వేసుకోవాలి.
2. రుచికి సరిపడ ఉప్పువేసుకోవాలి
3. 1 టేబుల్ స్పూన్ మంచి నూనెను వేసుకోవాలి.
4. బ్రాండెడ్ నూడుల్స్‌ను మాత్రమే ఉపయోగించాలి.
5. హై ఫ్లేమ్‌లోనే నూడుల్స్‌ను ఉడికించుకోవాలి.
6. ప్లేట్‌కు నూనె రాశి అందులో నూడుల్స్‌ను
వంపుకోవాలి.
7. నూడుల్స్ అంటుకోకుండా కొంచెం నూనెను వేసుకోవాలి.
8. 200 గ్రాముల బోన్‌లెస్ చికెన్‌ను
తీసుకోవాలి.
9. 1 టేబుల్ స్పూన్ కారం పొడి
10. 1 టీస్పూన్ అల్లం పేస్టు
11. తగినంత ఉప్పు
12. 2 టేబుల్ స్పూన్ల మైదపిండి
13. 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి కొన్ని నీళ్లు
పోసుకొని బాగా మారినేట్ చేసుకోవాలి.
14. చిటికెడంత ఫుడ్ కలర్‌ను కూడా వేసుకోవాలి.
15. ఈ చికెన్ ముక్కలను మరిగే వేడి వేడి నూనెలో వేసుకోవాలి.
16. క్రీస్పీగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి.
17. ఫ్రై అయిన చికెన్ ముక్కలను చిన్న ముక్కలగా కట్ చేసుకోవాలి.
18. కడాయిలో 2 టేబలు్ స్పూన్ల నూనెను పోసి వేడి చేసుకోవాలి.
19. 2 టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్టును వేసుకోవాలి.
20. 1 పచ్చి మిర్చి, 1 ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి.
21. 1/4 కప్పు సన్నగా తరిగిన క్యాప్సికం, 1/2 కప్పు సన్నగా తరిగిన
క్యారెట్ ముక్కలను వేసుకోవాలి.
22. 1 కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కలను కూడా వేసుకోవాలి.
23. కట్ చేసిన చికెన్ ముక్కలను కూడా వేసుకొని చిటికెడంత ఉప్పు
వేసుకొని కలుపుకోవాలి.
24. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1. 1/2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ
సాస్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్
25. 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసి
బాగా కలుపుకోవాలి.
26. 4 టేబలు్ స్పూన్ల నీళ్లను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
27. ఇప్పుడు ఉడికించిన నూడుల్స్‌ను వేసుకొని ఫ్రై చేసిన
దాంట్లో కలుపుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications