Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
మామిడి పండ్లతో అదిరిపోయే డిజర్ట్.. సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు, డిన్నర్ తరువాత తింటే అదిరిపోతుంది!
ఎండాకాలం వచ్చేసింది. ఈ వేసవి కాలం అంటే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది మామిడి పండ్ల రుచి. ఎండాకాలంలో పచ్చళ్ళు, తాండ్రలు, ఆమ్‌చూర్‌లు మాత్రమే కాదు.. మామిడి పండ్లతో లలితమైన, చల్లదనాన్ని ఇచ్చే మధురమైన డిజర్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే తయారయ్యే ఈ ప్రత్యేక డిజర్ట్, వేసవి వేడిని మరచిపోయేలా చేస్తుంది. కానీ చాలా మందికి దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో మామిడి పండ్లతో డిజర్ట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
మామిడి పండ్లతో డిజర్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
మామిడి పండ్లు - 2 (బంగినపల్లి లాంటి తీపి రకాలు మంచివి)
కస్టర్డ్ పౌడర్ లేదా కార్న్ ఫ్లోర్ - 3 టేబుల్ స్పూన్లు
చక్కెర - 6 టేబుల్ స్పూన్లు
పాలు - 1 లీటర్
మిల్క్ బ్రెడ్ ముక్కలు - 8
మామిడి పండ్లతో డిజర్ట్ తయారీ విధానం:
మామిడి పండ్ల ప్యూరీ తయారీ:
మామిడి పండ్లను బాగా కడిగి తొక్క తీసి ముక్కలు కట్ చేయండి. ఆ తరువాత పావు కప్పు మామిడి ముక్కలు పక్కన పెట్టుకుని, మిగిలిన ముక్కలతో మిక్సీలో మెత్తగా ప్యూరీ చేయండి. ప్యూరీ నుండి రెండు టేబుల్ స్పూన్లు పక్కన పెట్టుకోండి.
మ్యాంగో జెల్ తయారీ:
చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల మామిడి ప్యూరీకి, కస్టర్డ్ పౌడర్ (లేదా కార్న్ ఫ్లోర్), రెండు టేబుల్ స్పూన్ల చక్కెర కలిపి, 250 మి.లీ. నీరు పోసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీడియం మంటపై ఉడికిస్తూ సెమీ-థిక్ కాన్సిస్టెన్సీకి వచ్చే వరకు వండండి.
ఈ రైస్ ఉదయం టిఫిన్ కోసం చేస్తే.. లంచ్ కూడా చేసేయొచ్చు, థ్రిల్ ఇచ్చే రుచి! ఎలా చేసుకోవాలంటే?
పూర్తిగా చల్లార్చి పక్కన పెట్టండి.
కస్టర్డ్ మిల్క్ తయారీ:
పావు కప్పు పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపండి.
స్టవ్ పై అర లీటర్ పాలు వేడి చేసి, అందులో నాలుగు టేబుల్ స్పూన్ల
చక్కెర వేసి కలపండి.
తర్వాత ముందుగా తయారుచేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని పోసి మూడు
నిమిషాలు మధ్య మంటపై ఉడికించండి. ఆ తరువాత మంట ఆపి చల్లార్చుతూ పైన
మీగడ ఏర్పడకుండా బాగా కలుపుకుంటూ ఉండండి. ఆ తరువాత మిల్క్ బ్రెడ్
ముక్కల అంచులను కత్తిరించి, ముక్కలు తయారు చేసుకోండి.
డిజర్ట్ అసెంబ్లీ:
ఒక గ్లాస్ బౌల్ తీసుకుని చల్లారిన కస్టర్డ్ మిల్క్ వేసి, దాని పైగా
బ్రెడ్ ముక్కలు అమర్చండి.
బ్రెడ్ పై మామిడి ప్యూరీ వేసి మరోసారి కస్టర్డ్ మిల్క్ పోయండి.
మళ్లీ బ్రెడ్ ముక్కలు అమర్చిన తరువాత మామిడి ప్యూరీ లేయర్ వేసి,
చివరగా మ్యాంగో జెల్, మామిడి ముక్కలు వేసి సమానంగా పరచండి. ఆ తరువాత
గార్నిష్ కోసం చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ చల్లి అలంకరించండి. ఇప్పుడు ఆ
డిజర్ట్‌ను రెండు మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తరువాత చల్లచల్లగా
సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన సమ్మర్ స్పెషల్ మ్యాంగో డిజర్ట్
సిద్ధమైనట్లే.
చివరగా:
ఈ వేసవిలో చల్లదనాన్ని కోరుకునేవారికి ఈ మామిడి స్పెషల్ డిజర్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో తయారయ్యే ఈ రుచికరమైన విందును తప్పకుండా ట్రై చేయండి!
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












