Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బర్డ్ ఫ్లూ రాకుండా.. ఈ పద్దతిలో చికెన్ పచ్చడి చేసుకుంటే నెలరోజులు తినొచ్చు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది
బర్డ్ ఫ్లూ భయంతో చాలా మంది చికెన్ తినడమే మానేశారు. అందరూ కొంచెం డబ్బులు ఎక్కువైనా మటన్, ఫిష్ తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే అలాంటి వారు చికెన్‌ను బాగా ఫ్రై చేసుకొని పచ్చడి పెట్టుకొని తినొచ్చు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా. దీనిని చేసుకోవడం చాలా సులభం. ఇంట్లోని పదార్థాలతో చేసుకోవచ్చు. దీనిని చేసుకోవడానికి ఎలాంటి పదార్థాలు కావాలి? ఏ విధంగా దీనిని చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చికెన్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ - 1/2 కిలో
నూనె - 150ml/1 కప్పు
ఉప్పు - 1/4 కప్పు
కారం - 1/4 కప్పు
పసుపు - 1/4 టీస్పూన్
దాల్చిన చెక్క - 1 అంగుళం
యాలకులు - 2
లవంగాలు - 5 నుండి 6
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్
మెంతులు - 1/4 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
నిమ్మకాయలు - 2 (మధ్యస్థంగా)

తయారుచేసే విధానం:
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి.
తర్వాత ఒక పాన్ లో నూనె వేసి, వేడి అయ్యాక చికెన్ ముక్కలను బంగారు
రంగు వచ్చే వరకు వేయించాలి.
వేయించిన చికెన్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్ లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు,
ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు
వేయించాలి.
ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి.
వేయించిన చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి.
చివరగా నిమ్మరసం వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.
చికెన్ పచ్చడిని చల్లారనిచ్చి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ
చేసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications