Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
తమిళనాడు స్టైల్ మామిడికాయ పచ్చడి.. ముక్క తింటే మైమరచిపోవాల్సిందే, ఎలా చేసుకోవాలంటే?
వేసవి అంటే తెలుగు వారి ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉండాల్సిందే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే.. ఎంత కమ్మగా ఉంటుందంటే చెప్పడానికి కూడా నోట్లో లాలాజలం నిండి ఉంటుంది. అంత కమ్మగా ఉంటుంది. ఒక్కరోజు కూడా ఈ పచ్చడి లేని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదేమో! అయితే ప్రతిసారీ చేసే విధానాన్ని మార్చి, కొత్త రుచిని ఆస్వాదించాలనుకునేవారికి ఈసారి తమిళనాడు స్టైల్ మామిడికాయ పచ్చడి ట్రై చేయండి. తమిళనాడు స్టైల్ పచ్చడి ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని సరైన కొలతల్లో చేస్తే సంవత్సరం పాటు మెత్తబడకుండా, రంగు మారకుండా నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు ఈ ఆసక్తికరమైన పచ్చడి ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
మామిడికాయ ముక్కలు - 1.5 కిలోలు (పుల్లగా ఉండే మామిడికాయలు
ఉత్తమం)
రాళ్ల ఉప్పు - 1/2 కప్పు
ఆవాలు - 50 గ్రాములు
మెంతులు - 3 చెంచాలు
కారం పొడి - 1 కప్పు
ఇంగువ - 1.5 చెంచాలు

తాలింపుకు:
నువ్వుల నూనె - 1.5 కప్పులు
ఆవాలు - 4.5 చెంచాలు
మెంతులు - 3 చెంచాలు
ఇంగువ - 1/4 చెంచా
పసుపు - 1 చెంచా
తయారీ విధానం:
1. మామిడికాయల ప్రాసెసింగ్:
ముందుగా మామిడికాయలను బాగా కడిగి పూర్తిగా తడి లేకుండా తుడిచేసుకోవాలి. తర్వాత వాటిని సమాన ముక్కలుగా కోసుకోవాలి. ముక్కలపై ఉండే సన్నని పొరను తీసి, వాటిని ఒక గుడ్డపై పెట్టి గాలి లో 1 గంటవరకు ఆరనివ్వాలి.
2. ఉప్పు తయారీ:
రాళ్ల ఉప్పును గ్రైండర్లో వేసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.
3. పచ్చడి మిశ్రమం:
ఆరిన మామిడికాయ ముక్కలపై ఉప్పు చల్లి కలిపి కొన్ని గంటలు పక్కన ఉంచాలి. మరోవైపు పాన్లో ఆవాలు, మెంతులు కొద్దిగా వేయించి, చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడి, కారం, ఇంగువను కలిపి మామిడికాయ ముక్కలలో వేసి బాగా కలపాలి.
4. తాలింపు తయారీ:
నూనెను వేడి చేసి అందులో ఆవాలు, మెంతులు వేయించి, తర్వాత ఇంగువ, పసుపు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపి మెత్తగా కలపాలి.
5. నిల్వ ప్రక్రియ:
పచ్చడిని గాజు జాడీలో వేసి పై మూత వేసి, పైగా కాటన్ గుడ్డ కట్టి గట్టిగా తాడుతో కట్టి ఉంచాలి. మూడు రోజులు ప్రక్కకెవ్వరూ తాకని ప్రదేశంలో ఉంచాలి. తర్వాత బయటకు తీసి మరోసారి కలిపి, అవసరమైతే ఇంకొంచెం ఉప్పు కలిపి నిల్వ ఉంచుకోవాలి.
ముఖ్యమైన సూచనలు:
గాజు జాడీలు లేదా గాజు జార్లే ఉపయోగించాలి. ప్లాస్టిక్, స్టీల్
పాత్రలు పచ్చడి నాశనం చేస్తాయి.
ఆవాలు, మెంతులు సరిగ్గా వేయించకపోతే పచ్చడికి బూజు వచ్చే అవకాశం
ఉంటుంది.
నూనె పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిలో కలపాలి.
నిల్వ ఉంచే చోట చల్లగా, పొడి వాతావరణం ఉండాలి.
ఫైనల్ టచ్:
వేడి అన్నంలో ఈ పచ్చడి, కాస్త ముద్దపప్పు, నెయ్యితో కలిపి తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది. ఇది ఒక్కసారి తయారుచేస్తే నెలలు నెలల పాటు నిల్వ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఈ తమిళశైలి మామిడికాయ పచ్చడి ట్రై చేసి చూడండి.. కొత్తదనం, రుచిని అనుభవించండి!
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
