Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పెళ్లిభోజనాల స్టైల్లో క్రిస్పీ ఆలూ ఫ్రైని చేసుకుందామా..?
కూరలు, పప్పు, చార్‌తో తినొచ్చు కానీ ప్లేట్‌లో ఫ్రై లేకపోతే ఏదో వెలితిగా వున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆర్టికల్‌లో ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పెళ్లి భోజనాల్లో వచ్చే టేస్ట్‌లా ఆలూ ఫ్రైను చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీని కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్‌కు అవసరం పడవు. ఆలూ ఫ్రైను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
ఆలూఫై తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్
మూడు ఆలుగడ్డలు, కారం, దనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, మంచి నూనె, మిరపకాయలు, కరివేపాకుల.
ఆలూఫ్రై తయారు చేసే విధానం
1. ఆలూ ఫ్రై చేయడానికి మూడు మీడియం సైజు బంగాళు దుంపలను తీసుకోవాలి. బంగాళా దుంపలను బాగా కడిగి వాటిపైనున్న పొట్టును పీలర్‌తో తీసేసుకోవాలి. బంగాళా దుంపలను పెద్ద సైజులో కట్ చేయకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలను ఉడికించడానికి వాటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. బౌల్‌లో ఆలుగడ్డలు ఉడకడానికి దాంట్లో రెండు నుంచి మూడు గ్లాసుల నీళ్లను తీసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పును తీసుకొని ఈ పొటాటో ముక్కలను స్టవ్‌పై ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల ఆలూగడ్డలో వున్న స్టార్చ్ మొత్తం సెపరేట్ అవుతుంది. దీని వల్ల ఆలూ ఫ్రై చాలా టేస్టీగా కూడా మారుతుంది.
2. బౌల్‌లో ఆలూను మరో రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించాలి. ఆలూ అరవై శాతం ఉడికేలా చూసుకోవాలి. మరీ మెత్తగా ఉడికితే ఫ్రై చేయడానికి సాధ్యం కాదు. నీటిలోంచి ఆలూ ముక్కలను స్టైనర్ సాయంతో బయటకు తీసుకొని ఆలూ ముక్కలను ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఈ బౌల్‌లో ఒక టీ స్పూన్ కారంపొడిని, ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని, మరో పావు టీస్పూన్ మిరియాల పొడిని తీసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. మరింత టేస్ట్ రావడానికి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వలన పుల్లపుల్లగా రుచి చాలా బాగుంటుంది.

3. ఇప్పుడు వేసుకున్న వాటిని మొత్తం ఆలూముక్కలతో కలుపుకొని మారినేట్ చేయాలి. కోటింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. మరో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండిని కూడా వేసుకోవాలి. మైదా పిండికి బదులుగు రెండు టేబుల్ స్పూన్ల చెనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు.
4. ఆలూ ఫ్రై కలర్‌ఫుల్ గా కనబడ్డానికి చిటికెడు కలర్‌ను యాడ్ చేసుకోవాలి. ఆలూ ఫ్రై చేయడానికి కడాయ్‌లో తగినంత ఆయిల్‌ను తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడేయ్యేంత వరకు చూసుకోవాలి. తరువాత ఒక్కో ఆలూ ముక్కను నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.
5. ఒక నిమిషంపాటు ఆలూ ముక్కలను ఆలాగే ఫ్రై చేసుకోవాలి. అన్ని ఆలూ ముక్కలను ఫ్రే చేసుకోవాలి. ఆలూ ముక్కలను రెండు సార్లు ఫ్రై చేయాలి. మొదటి సారి కొంచెం ఫ్రై చేసిన తరువాత ఒక ప్లేట్‌లో తీసుకొని, చల్లారిన తరువాత మళ్లీ అవే ఆలూ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. ఫ్రై చేసేటప్పుడు ఐదారు పచ్చిమిరకపాయ ముక్కలను కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక ఆయిల్ నుంచి వీటిని తీసుకోవాలి. ఆలూ ఫ్రై మరింత టేస్టీగా రావడానికి చాల్ మసాలాను ఆలూ ఫ్రైపై చల్లుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications