Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Chicken fry: చికెన్ వేపుడు..ఇలా చేశారంటే కంచం ఖాళీ చేసేస్తారు,టచ్చింగ్ లోకి అయితే కేక
చికెన్ తో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. అయితే స్పైసీగా చేసే చికెన్ ఫ్రై మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. దీన్ని పక్కా కొలతలు పాటిస్తూ వండితే ఇంకా అదిరిపోయే రుచి వస్తుంది. మందుబాబులు అయితే టచ్చింగ్ లోకి ఇది ఎక్కువగా తింటారు.. సిప్పు సిప్పుకి 10 ముక్కలు తినేస్తుంటారు. దీన్ని చపాతీలో అయినా లేదా రుమాలీ రోటీలోకి అయినా లేదా అన్నంలో అయినా తింటే అద్భుతంగా ఉంటుంది. అయితే ఈసారి రెస్టారెంట్ కి వెళ్లి తినే బదులు ఇంట్లోనే ఈజీగా చికెన్ ఫ్రై ని టేస్టీగా చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, చికెన్ ఫ్రై తయారీ విధానం ఇక్కడ చూడండి.
చికెన్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
-బోన్ చికెన్
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-వెల్లుల్లి
-కరివేపాకు
-కొత్తిమీర
-పచ్చిమిర్చి
-కారం
-ఉప్పు
-ధనియాలు
-బిర్యానీ ఆకు
-లవంగం
-జాపత్రి
-దాల్చిన చెక్క
-జీలకర్ర
-ఆయిల్
-పసుపు
స్పైసీ చికెన్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా 1 కేజీ బోన్ తో కూడిన చికెన్ బౌల్ లో వేసి శుభ్రంగా కడిగి అందులో 1 టీస్పూన్ పసుపు,అర టీస్పూన్ కారం పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి అన్నీ ముక్కలకు కలిసేటట్లు బాగా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 10 ఎండు మిరపకాయలు, 1 టీస్పూన్ జీలకర్ర,2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 8 లవంగాలు, 2 ఇంచుల చెక్క,1 బిర్యానీ ఆకు, 4 యాలకులు,జాపత్రి కొద్దిగా వేసి లైట్ గా కలర్ మారేవరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లబడిన తర్వాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలును కచ్చాపచ్చాగా దంచి అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఓ బాండీ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన 200 గ్రాముల ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రంగు మారడం స్టార్ట్ అయినప్పుడే అందులో కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి కలిపి 2-3 నిమిషాల తర్వాత చికెన్ ముక్కలను ఇందులో వేసి కలపండి. మంటను తక్కువలో పెట్టుకోండి.
-5 నిమిషాల తర్వాత చికెన్ లో నుంచి నీళ్లు రావడం ప్రారంభమవుతుంది. అప్పుడు అందులో నాలుగు రెమ్మల కరివేపాకు,6 పచ్చిమిర్చి మధ్యలో గాటు పెట్టి వేయండి.
-తర్వాత అందులో గ్రైండ్ చేసి ఉంచిన మసాలా పొడిని చికెన్ లో వేసి కలపి ముక్క ఉడికేవరకు తక్కువమంట మీద ఫ్రై చేసుకోండి.
-చివరిలో స్టవ్ ఆఫ్ చేసే రెండు నిమిషాల ముందు చికెన్ లో 1 టీస్పూన్ పెప్పర్ పౌడర్ వేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












