Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
లంచ్.. బ్రేక్‌ఫాస్ట్.. దేనికైనా ఆనియన్ పరోటా సూపర్.. చేయడం చాలా సింపుల్..!
పరోటా అనగానా ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. పరోటాల్లో చాలా రకాలున్నాయ్. ఆనియన్ పరోటా, ఆలూ పరోటా, ఎగ్ పరోటా ఇలా ఎన్ని రకాల పరోటాలైనా సరే తనివితీరా తినాలనిపిస్తుంది. ఈ పరోటాను ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా చేసుకుంటారు. దక్షిణ భారతదేశంలో మిరపకాయ బజ్జీకి ఎంత పాపులారిటీ వుందో అంత పాపులారిటీ పరోటాకు ఉత్తర భారతంలో వుంది. క్రమంగా ఈ డిష్ దక్షిణ భారతదేశంలో కూడా చాలా పాపులర్ అయింది. ముందుగా ఆలూ పరోటాను చాలా మంది చేసుకునే వారు. తరువాత రకరకాల పరోటాలు వచ్చాయ్. ఈ ఆర్టికల్‌లో మీకు ఆనియన్ పరోటా రెసిపీని తీసుకొని వచ్చాం. ఈ ఆనియన్ పరోటాను చాలా సింపుల్‌గా ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే చేసుకోవచ్చు.
ఆనియన్ పరోటా తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్లు
గోదుమ పిండి, ఉప్పు, ఆయిల్, నెయ్యి, ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం, వాము, కారంపొడి, కొత్తిమీర ఆకులు, దనియాలు, గరం మసాలా, పుట్టాల పప్పు, బటర్.

ముందుగా ఒక బౌల్‌లో ఒకటిన్నర కప్పు గోదుమ పిండిని తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అవసరానికి సరిపడా నీళ్లను పిండిలో పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ పలుచగా, మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని మొత్తం కలిపిన తరువాత దానికి కొంత నూనెను అప్లై చేసి బౌల్‌లో పెట్టుకొని మూతను క్లోజ్ చేయాలి.
ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. రోట్లో రెండు పచ్చి మిరకపకాయలను, అల్లం ముక్కలను వేసుకొని దంచుకోవాలి. ఈ పేస్టును కోసిన ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇందులో అరటీస్పూన్ వామును, అరటీస్పూన్ కారంపొడిని, రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులను, అర టీస్పూన్ ధనియాల పొడిని, అర టీస్పూన్ గరంమసాలాను యాడ్ చేసుకోవాలి. ఈ బౌల్‌ను పక్కనబెట్టాలి.
తరువాత మిక్సింగ్ జార్‌లో రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు పొడిని ఇంతకు ముందు ఉల్లిపాయలు వేసిన బౌల్‌లో వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ స్టఫ్‌ను బాగా కలుపుకోవాలి. ఇప్పుడ స్టఫ్ మొత్తం రెడీ అయిన తరువాత పరోటాల కోసం రోటీలను చేసుకోవాలి.
కలుపుకున్న గోదుమ పిండి లోంచి చపాతీలు చేయడానికి పిండిని తీసుకొని దాన్ని చపాతీలుగా రోల్ చేసుకోవాలి. రోటీలు మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు పూరీల్లో చేసుకోవాలి. ఈ పూరీని అరచేతిలోకి తీసుకొని ఇందులో స్టఫ్‌ను ఫిల్ చేసుకోవాలి. ఒక్కో రోటీలో రెండు నుంచి మూడు టీస్పూన్ల స్టఫ్‌ను రోటీలో ఫిల్ చేసుకోవాలి. చుట్టూ వున్న రోటీ పిండితో స్టఫ్‌ను మొత్తం క్లోజ్ చేయాలి. నెమ్మదిగా ఇలా చేసుకుంటూ స్టఫ్ మొత్తం రోటీలో సెట్ అయ్యేలా చూసుకోవాలి.
అరచేతితో రోటీపై స్టఫ్‌ను నెమ్మదిగా ప్రెస్‌చేసుకుంటూ పొడి పిండిని చల్లుకుంటూ రోటీని రోల్ చేయాలి. పరోటా చిరిగిపోకుండా జాగ్రత్తగా రోల్ చేయాలి. స్టవ్‌పూ ఒక పెనం తీసుకొని బాగా వేడి అయిన తరువాత దానిపై పరోటాను కాల్చుకోవాలి. పరోటా కొంచెం కాలిన తరువాత బటర్‌ను లేదా నూనెలో అప్లై చేసుకోవాలి. పరోటా మాడిపోకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చాలి. ఇక దీంతో ఆనియన్ పరోటా రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications