Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
పెరుగువడ..ఇలా చేసుకున్నారంటే స్పాంజీలా మెత్తగా నోట్లో కరిగిపోతాయ్
పెరుగు వడని ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే చాలు మూడు పూట్ల పెరుగువడే తినోటోళ్లు చాలామందే ఉంటారు. అయితే పెరుగు వడ చేయడం అందరికీ కుదరదు. చేసే విధానంలోనే దీని అసలు రుచి దాగి ఉంటుంది. పెరుగు వడలు మెత్తగా స్పాంజీగా ఉండి తింటుటంటే నోట్లోకి అలా జారిపోతున్నట్లు రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. టేస్టీగా జ్యూసీగా పెరుగు వడలు రావాలంటే ఏం చేయాలో ఇక్కడ చూడండి.
పెరుగు వడ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-పెరుగు
-ఆవాలు
-జీలకర్ర
-కరివేపాకు
-శెనగపప్పు
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-అల్లం
-ఉప్పు

పెరుగు వడ తయారీ విధానం
-పావు కిలో మినపప్పుని 4 గంటలపైనే నానబెట్టాలి.
-తర్వాత ఇందులో ఉప్పు వేసి కలిపి మిక్సీలో వేసి ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి ఉన్నట్లుగా జారుగా ఉండేలా చూసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో 1 టీస్పూన్ జీలకర్ర,1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ శెనగపప్పు, 1 టీస్పూన్ ఆవాలు వేసి 80 శాతం ఫ్రై అయ్యాక అందులో రెండు కట్ చేసిన ఎండుమిర్చి, 1పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం తరుగు వేసి కలిపండి.
-తర్వాత 1 లీటర్ చిలికిన పెరుగులో ఈ తిరగమాతని వేసి కలపండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయండి.
-ఇప్పుడు ఇంకో గిన్నెలో 1 లీటరు నీళ్లు పోసి ఇందులో కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు మిక్చర్ వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఆయిల్ పోసి వేడి చేసి అందులో ముందుగా గ్రైండ్ చేసిన పిండితో వడలు వేసుకోవాలి.
-బాండీలో నుంచి తీసిన వడలను పక్కనపెట్టుకున్న నీళ్ల గిన్నెలో వేసి 5 నిమిషాలు అలాగే ఉండనివ్వండి.
-తర్వాత వడలను పిండకుండా అలానే తీసి ఇంకో బౌల్ లో వేసి దాని మీద ముందుగా రెడీ చేసుకున్న పెరుగు మిక్చర్ మొత్తం పోసి అరగంట పాటు అలా వదిలేయండి. అంతే టేస్టీ పెరుగు వడ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications