Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఈ స్టైల్లో రొయ్యల బిర్యానీని ఎప్పుడైనా చేశారా..? తింటే జీవితంలో మరిచిపోలేరు..!
సీ ఫుడ్‌లో రొయ్యలకు వుండే టేస్టే వేరబ్బా అని అనిపించక మానదు. రొయ్యల వేపుడు, రొయ్యల చారు, రొయ్యల కూర ఇలా ఏ వంటకమైనా నోట్లో లాలాజలం పొంగుకుంటూ బయట పడాల్సిందే. ఇన్ని రొయ్యల వెరైటీలలో రొయ్యల బిర్యానీ రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. రొయ్యల బిర్యానీ రెసిపీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
రొయ్యల బిర్యానీ చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
అరకిలో రొయ్యలు, ఎల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నిమ్మకాయ, నెయ్యి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలాకులు, జిలకర, సాజీర, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, కారంపొడి, బిరయానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పూదీన.
రొయ్యల బిర్యానీ తయారు చేసే విధానం
1. ముందుగా ఒక బౌల్‌లో అరకిలో రొయ్యలను బాగా కడిగి తీసుకోవాలి. నీటిలో బాగా కడిగి ఏ చెత్తా లేకుండా చూసుకోవాలి. నీళ్లంటినీ బయటకు వొంపి రొయ్యలను బౌల్‌లోకి తీసుకోవాలి. ఒక మిక్సీ గ్రైండర్‌లో పొట్టు తీసిన 12 ఎల్లిపాయలను తీసుకోవాలి. రెండు ఇంచులు అల్లం ముక్కలను, మూడు నుంచి నాలు పచ్చిమిరపకాలయు వేసుకోవాలి. దీన్ని బాగా గ్రైండ్ చేయాలి.
2. గ్రైండ్ చేసిన పేస్ట్‌లో రొయ్యలు వున్న బౌల్‌లోకి తీసుకోవాలి. తగినంత ఉప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపును, సగం నిమ్మకాయను పిండుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలు మొత్తాన్ని మారినేట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత బౌల్‌కు మూత పెట్టి అరగంటపాటు అలాగే వదిలివేాయాలి.
3. తరువాత ఒక గెన్నెలో రెండు గ్లాసుల బాస్మతీ బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యాన్ని నీటితో బాగా కడిగి 20 నిమిశాలపాటు నీళ్లల్లో బాగా నానబెట్టాలి.
4. కుక్కర్‌లో బిర్యానీని చేస్తాము కాబట్టి. కుక్కర్‌ను స్టవ్‌పైన పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని, రెండు టేబుల్ స్పూన్ల మంచి నూనెను పోసుకోవాలి. ఇందులో పోప్ చేయడినికి లవంగాలు, ఒక దాల్చిన చెక్క, మూడు యాలాకులు, తగినంత జిలకర, తగినంగ సాజీర వేసుకోవాలి. రెండు బిర్యానీ ఆకులను కూడా కుక్కర్‌లో వేసుకొని బాగా కలపాలి.
5. ఇప్పుడు కుక్కర్‌లో సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. రెండ టమాట ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకొని కుక్కర్‌లో ఫ్రై చేసుకోవాలి.
6. తరువాత కలిపిన రొయ్యలను కుక్కర్‌లో వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి 4 నుంచి 5 నిమిషాల వరకు కుక్కర్‌లో రొయ్యలను బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారంపొడి, ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీస్పూన్ గరం మసాలా, ఒకటిన్న టీస్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని గరిటెతో బాగా కలుపుకోవాలి.
7. ఒక కట్ట కొత్తిమీర ఆకును, ఒక కట్టి పూదీన ఆకులను కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా 5 నిమిషాల వరకు ఉడికించాలి. తరువాత నానబెట్టిన బియ్యాన్ని కుక్కర్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు నుంచి మూడు నిమిశాల వరకు ఈ బియ్యాన్ని కలుపుతూ ఫ్రై చేయాలి.
8. ఇప్పుడు కుక్కర్‌లో రెండున్నర నుంచి 3 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉప్పు సరిపోతుందా లేదా టేస్ట్ చేసి చెక్ చేసుకుంటూ ఉప్పును వేసుకోవాలి. కుక్కర్ మూతను క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు స్టవ్ పై పెట్టాలి. ఒక విజిల్ రాగానే కుక్కర్‌ను స్టవ్ పై నుంచి కిందకు దించివేయాలి.
9. కుక్కర్‌లోంచి విజిల్ మొత్తం పోయేంత వరకు ఆగి, మూత తీసి బిర్యానీని గరిటెతో కలుపుకొని ఒక గిన్నెలోకి కొంచం రొయ్యల బిర్యానీని వేసుకోవాలి. ఇక దీంతో టేస్టీ రొయ్యల బిర్యానీ రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












