Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
నోరూరించే జీరా రైస్.. రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందామా..!
మ్యాగీ చేసినంత ఫాస్ట్‌గా టేస్టీ ఫుడ్ ఏదైనా చేసుకోవచ్చా అని ఆలోచన వచ్చనప్పుడు మన మదిలోకి ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్‌లో జీరా రైస్ టాప్‌లో వుంటుంది. జీరా రైస్‌ను ఇంట్లో వుండే వంట సామాగ్రితోనే సింపుల్‌గా చేసుకోవచ్చు.
జీరా రైస్ చేయడానికి కావలసిన పదార్ధాలు
నార్మల్ రైస్ (అన్నం), జిలకర, నెయ్యి, ఆవాలు, ఎండిమిరపకాయలు, బగారా ఆకు, ఇలాచీ, నూనె, ఉప్పు.
జీరలో పోషకాలు మెండుగా వుంటాయి. ఇందులో ఐరన్‌తో పాటు జింక్, కాపర్ పోషకాలుంటాయ్. బిర్యానీకి ఎంత పాపులారిటీ వుందో జీరా రైస్‌కు కూడా అంతే పాపులారిటీ వుంది. రెస్టారెంట్లో స్టైల్లో చేసే జీరా రైస్ చాలా టేస్టీగా వుంటుంది. ఇంట్లో చేసిన జీరా రైస్ కొంచెం చప్పగా, పొడిపొడిగా వుంటుంది. ఇప్పుడు జీరా రైస్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం.
ఇప్పుడు రెండు కప్పుల బాస్మతీ బియ్యాన్ని తీసుకొని బాగా కడగాలి. తరువాత ఆ బాస్మతీ బియ్యాన్ని 30 నిమిషాల వరకు నీళ్లల్లో నానబెట్టాలి.
కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని వేడి చేయాలి. అందులో ఒక బగారా ఆకు, రెండు దాల్చిన చెక్కలు, నాలుగు లవంగలు, 4 ఇలాచీలు, రెండు టీ స్పూన్ల జిలకర వేసి బాగా కలుపుకోవాలి.

మీడియం ఫ్లేమ్‌లో బగారాను మొత్తం ప్రై చేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులో ఒక ఉల్లిపాయను సన్నగా కోసి వేయాలి. నాలుగు పచ్చిమిరపకాయలను కూడా కోసి అందులో వేయాలి. ఎండిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు.
కడిగిన బాస్మతి రైస్‌ను ఇప్పుడు బగారా వున్న కుక్కర్లో వేసుకోవాలి. 5 నిమిషాల వరకు స్టవ్‌ను హై ఫ్లేమ్‌లో పెట్టి రైస్‌ను కలుపుకోవాలి. రైస్ బగారాలో ఉడకడానికి కుక్కర్‌ను రెండున్నర కప్పుల నీళ్లను పోసుుకోవాలి. తరువాత మీకు తగినంత ఉప్పును వేసుకొని కొంత కలుపుకోవాలి.
కుక్కర్‌కు మూతను పెట్టి హై ఫ్లేమ్‌లో ఉడికించాలి. రైస్ బాగా ఉడికేంత వరకూ చూసుకోవాలి. కుక్కర్ విజిల్ మొత్తం అయిపోయిన తరువాత మూత తీసి అవసరమనుకుంటే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. దీంతో మన జీరా రైస్ ఇక రెడీ అయినట్టే. ఈ జీరారైస్ను పప్పుతో, పచ్చడితో కూడా తినవచ్చు.
జీరారైస్ మరింత బాగా రావాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
మంచి బాస్మతి రైస్‌ను మాత్రమే జీరారైస్ చేయడానికి ఉపయోగించాలి. బాస్మతీ కాకుండా మంచి నార్మల్ రైస్‌తో అయినా జీరారైస్ను చేసుకోవచ్చు. వండే ముందు జీరారైస్ను నీళ్లల్లో కనీసం 20 నిమిశాలు ఖచ్ఛితంగా నానబెట్టాలి.
జీరారైస్లో వుండే పోషకాలు, జీరా రైస్ ఆరోగ్యకరమేనా..
ఒకరికి సరిపోయే జీరారైస్లో 246 క్యాలరీలు వుంటాయ్. ప్రొటీన్లు 3.7 గ్రాములుగా వుంటాయ్. 42 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్లుంటాయ్. ఫైబర్ 2 గ్రాములుంటుంది. కొవ్వు ఆరు గ్రాములుంటుంది. క్యాల్షియం ఏడు మిల్లీగ్రాములుంటుంది. పొటాషియం 4.8 మిల్లీగ్రాములుంటుంది. రైస్‌లో ఫైబర్ కంటెంట్ తక్కువగా వుంటుంది. ఇందులో వుండే ఉల్లిపాయల్లో వైటమిన్ సి పుష్కలంగా వుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications