Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Egg Roll: తింటే ఇలాంటి ఎగ్ రోల్ తినాలి, నోట్లో వేసుకునే నాలుక తాండవమే, ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?
మన ఇంట్లో పిల్లలైనా మనం అయినా అన్నం తినడానికి బదులుగా ఎక్కువగా స్నాక్స్ తింటూ ఉంటాము. చిరు తిండ్లు తినడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇవి రుచికరంగా ఉండడంతో పాటు శరీరానికి కావాల్సిన శక్తి కూడా తక్షణమే అందుతుంది. కానీ వీటిని తినాలంటే కచ్చితంగా బయటికి వెళ్ళాలి. వాటిని చేసుకోవడం రాక, ఎలా చేసుకోవాలో తెలియక.. బయటికి వెళ్లి తినే సమయం లేక తినాలనే కోరికను చాలా మంది తమలోని చంపేసుకుంటారు. అలాంటి స్నాక్స్ ఐటెంలో ఒకటి ఎగ్ రోల్. దీనిని ఇంట్లోనే చాలా రుచికరంగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ కూడా. అయితే ఎగ్ రోల్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎగ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
మైదా పిండి: 1 కప్పు
గుడ్లు: 3-4
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
టమాటా: 1 (సన్నగా తరిగినది)
కారం: 1/2 టీస్పూన్
గరం మసాలా: 1/4 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: సరిపడినంత
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)

ఎగ్ రోల్స్ తయారీ విధానం:
మైదా పిండిలో తగినంత ఉప్పు, నీరు వేసి చపాతీ పిండిలా
కలుపుకోవాలి.
కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీల్లా ఒత్తుకోవాలి.
స్టౌ మీద పెనం పెట్టి నూనె వేసి చపాతీలను రెండు వైపులా
కాల్చుకోవాలి.
ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కారం,
గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.
స్టౌ మీద పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి గుడ్డు మిశ్రమాన్ని వేసి
ఆమ్లెట్‌లా వేసుకోవాలి.
కాల్చిన చపాతీలపై ఆమ్లెట్ పెట్టి రోల్ చేసుకోవాలి.
మీకు కావాలంటే టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయవచ్చు.
చిట్కాలు:
గుడ్డు మిశ్రమంలో మీకు నచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు.
రోల్ మరింత రుచిగా ఉండాలంటే కొద్దిగా చీజ్ కూడా వేసుకోవచ్చు.
రోల్ చేసేటప్పుడు కొద్దిగా వెన్న రాస్తే మరింత రుచిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications