Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
తెలంగాణ మొత్తంలో ఇదే హైలైట్ వంట, అదే తాటికల్లు చికెన్.. ముక్క తింటే ముద్దు పెట్టాల్సిందే, ఎలా చేసుకోవాలంటే?
తెలంగాణలో నాన్ వెజ్ చాలా ఫేమస్. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ప్రజలకు ముక్క లేనిదే ముద్ద దిగదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ నాన్ వెజ్ ఉండాల్సిందే. తెలంగాణాలో నాన్ వెజ్ వండుకునే విధానం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చికెన్‌ను వివిధ రకాల పద్ధతుల్లో వండుకుంటూ ఉంటారు. అవి కూడా చాలా రుచికరంగా తింటే నోరూరించే విధంగా ఉంటాయి. అలంటి వంటకాల్లో ఒకటే తాటికల్లు చికెన్. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనిని చేసుకోవడం కూడా చాలా సులభం. కేవలం తాటికల్లు ఎక్కువ పడుతుంది అంతే. కానీ రుచి మాత్రం డబల్ అవుతుంది. ఈ స్టోరీలో తెలంగాణ స్టైల్ తాటికల్లు చికెన్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
తెలంగాణ స్టైల్ తాటికల్లు చికెన్ తయారీ విధానం:
తాటికల్లు చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు:
చికెన్: 1 కేజీ (మీడియం సైజు ముక్కలు)
తాటికల్లు: 1 కప్పు
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 4 (చీలికలు)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
కారం: 2 టీ స్పూన్లు
ధనియాల పొడి: 1 టీ స్పూన్
గరం మసాలా: 1/2 టీ స్పూన్
పసుపు: 1/2 టీ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు: కొద్దిగా
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)
తాటికల్లు చికెన్ తయారీ విధానం:
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఒక కడాయిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు
వచ్చేవరకు వేయించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు
వేయించాలి.
ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా
కలపాలి.
తర్వాత చికెన్ ముక్కలు వేసి మసాలా బాగా పట్టేలా కలపాలి.
ఇప్పుడు తాటికల్లు వేసి మూత పెట్టి చికెన్ ముక్కలు మెత్తగా ఉడికే వరకు
ఉడికించాలి.
చికెన్ ఉడికిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్
ఆఫ్ చేయాలి.
అంతే, తెలంగాణ స్టైల్ తాటికల్లు చికెన్ రెడీ.
చిట్కాలు:
తాటికల్లు పుల్లగా ఉంటే చికెన్ కు పుల్లటి రుచి వస్తుంది.
తాటికల్లు లేకపోతే కొద్దిగా చింతపండు రసం వేసుకోవచ్చు.
చికెన్ ను మీడియం మంట మీద ఉడికించాలి, లేదంటే అడుగు అంటుతుంది.
ఈ చికెన్ ను రైస్, రోటీ, జొన్న రొట్టెతో తింటే చాలా రుచిగా
ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
చికెన్ లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
తాటికల్లులో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
ఈ వంటకంలో వాడే మసాలాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
ఇంకొక విషయం ఏంటంటే.. తాటికల్లు అనేది కొందరికి మాత్రమే నచ్చుతుంది. ఎవరైతే తాటికల్లు అలర్జీ ఉంటుందో వారు దీనిని ట్రై చేయకపోవడమే మంచిది. అలాగే తాటికల్లులో కూడా కొంత మొత్తంలో మత్తు పదార్థం ఉంటుంది. అందుకే దానిని మితంగా తీసుకోవడం ఉత్తమమైన నిర్ణయం. మీరు కనుక ఈ రిసిపిని ట్రై చేయాలని అనుకుంటే, మితంగా తాటికల్లును వినియోగించుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












