Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
గుడిలో ప్రసాదం స్టైల్లో కట్టె పొంగలిని ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా..?
కట్టె పొంగలిని ఇష్టపడనివారు ఉండరు. గుడిలో ప్రసాదంగా ఇచ్చినప్పుడు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఆంధ్రా ప్రాంతంలో ఈ కట్టెపొంగలిని ఇంకా బాగా చేస్తారు. సంక్రాంతి సమయంలో ఈ వంటకాన్ని మనం ఎక్కువగా చేసుకుంటాం. కట్టెపొంగలి గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. అందుకే మనం ఈ వంటకాన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెడతాం. ఈ కట్టె పొంగలిని టేస్టీగా ెలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.

కట్టె పొంగలి తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్ధాలు
ఒక కప్పు లావు బియ్యం
అరకప్పు పెసరపప్పు
ఉప్పు
2 టీస్పూన్ల నెయ్యి
2 టేబల్ స్పూన్ల నెయ్యి
1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం
కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు
2 టీస్పూన్ల జీడిపప్పు
1 టీస్పూన్ జిలుకర
2 ఎండి మిర్చీలు
కొన్ని కరివేపాకులు
ఒక టేబుల్ స్పూన్ మిరియాలు
పావు టీస్పూన్ పసుపు
కట్టె పొంగలి తయారు చేసే విధానం
ముందుగా బౌల్‌లోకి ఒక కప్పు లావు బియ్యాన్ని తీసుకోవాలి. లావు బియ్యంతోనే కట్టె పొంగలి చాలా బాగా అవుతుంది. దీంతో చేస్తేనే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ బియ్యం బాగా కడిగిన తరువాత అరగంట వరకు నానబెట్టాలి.
కుక్కర్‌లోకి అరకప్పు పెసరపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన పప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో 6 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇందులోనే నానబెట్టిన బియ్యం, పెసరపప్పును వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పును యాడ్ చేసుకోవాలి. 2 టీస్పూన్ల నెయ్యిని లేదంటే నూనెను పోసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి.
3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌ను స్టవ్ మీదపెట్టి తరువాత చూస్తే బియ్యం, పప్పు మెత్తగా ఉడకడం మనం చూడొచ్చు. ప్యాన్‌లో 2 టేబల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. 2 టీస్పూన్ల జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టీస్పూన్ జిలుకర, 2 ఎండి మిర్చీలను, కొన్ని కరివేపాకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఒక టేబుల్ స్పూన్ మిరియాలను, పావు టీస్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోప్ అంతా బాగా ఫ్రై అయిన తరువాత పొంగలిలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇక దీంతో టేస్టీ కట్టె పొంగలి రెడీ అయినట్టే. ఈ కట్టె పొంగలిని దేవుడికి నైవేద్యంగా చేసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్ డిన్నర్.. ఇలా ఎప్పుడైనా ఈ కట్టెపొంగలిని తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications