Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఉల్లి వడలు..ఎలా చేసుకోవాలంటే
ఉల్లి వడలు..పేరు వింటేనే నోరూరే ఈ అద్భుతమైన స్నాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం పడిన రోజు కానీ, సాయంత్రం వేళ టీ తాగేటప్పుడు కానీ ఉల్లి వడలు తింటే ఆ మజానే వేరు. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ఇవి ముందుంటాయి. అయితే చాలామంది ఉల్లి వడలను కేవలం ఒక చిరుతిండిగానే చూస్తారు. కానీ, వాటి తయారీలో వాడే పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉల్లి వడలను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఉల్లి వడ తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉల్లిపాయలు
-శెనగపిండి
-బియ్యపుపిండి
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-పసుపు
-ఆయిల్
-అల్లం

ఉల్లి వడ తయారీ విధానం
-ముందుగా 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా,పొడవుగా కట్ చేసుకోవాలి.
-కట్ చేసిన ఉల్లిపాయల్లో అర టీస్పూన్ ఉప్పు వేసి అది ఉల్లిపాయలకు బాగా పట్టేలా 2 నిమిషాలు చేత్తో బాగా కలుపుకొని మూతపెట్టేసి 15 నిమిషాలు పక్కన పెట్టేయండి.
-తర్వాత మూత తీస్తే ఉల్లిపాయల్లో నుంచి నీరు ఊరి ఉంటుంది. ఈ నీటినే పిండిలో కలుపుకుంటాం కాబట్టి దాన్ని పారబోయకూడదు.
-ఆ ఉల్లిపాయల్లోనే 4 పచ్చిమిరపకాయల సన్నని తరుగు, వీలైనంత సన్నగా తరిగిన 1 ఇంచు అల్లం, 6 రెమ్మల కరివేపాకు సన్నని తరుగు, అర టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి.
-తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ల లేదా పావు కప్పు శెనగపిండి, పావు కప్పు బియ్యం పిండి వేసి చేత్తో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
-తర్వాత చేతులకు కొంచెం నూనె రాసుకొని కొంచెం కొంచెంగా పిండిని చేతుల్లోకి తీసుకొని వడల్లా చేసుకోవాలి. మరీ లావుగా ఒత్తుకోకూడదు,మరీ పల్చగా ఉండేలా కూడా ఉండకూడదు.
-నూనె రాసిన ప్లేట్ లోకి వత్తుకున్న వడలన్నీ పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసి అందులో ఒక్కొక్కటిగా వేసి పైన పచ్చిదనం పోయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. మీడియం మంటమీదనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి బయటకు తీసేయాలి. అంతే టేస్టీ ఉల్లి వడ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications