Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అచ్చమైన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ పులుసు.. ఒకటే ముద్ద తినండి,మైమరచిపోవాల్సిందే.. ఎలా చేసుకోవాలంటే?
చిక్కటి గ్రేవీతో కారం, మసాలాల సువాసనతో గుత్తి వంకాయ కర్రీ ఎంతో మందికి చాలా ఇష్టం ఉంటుంది. అయితే ఈసారి సాధారణ గుత్తి వంకాయ కర్రీ కాకుండా, స్పెషల్ ఆంధ్రా స్టైల్ గుత్తి వంకాయ పులుసు ట్రై చేయండి. వేడి అన్నం, జీరా రైస్ లేదా పులావ్‌తో కలిపితే అద్భుతమైన రుచి ఇస్తుంది. ఇది ఎలా చేసుకోవాలో తెలియదని బాధపడుతున్నారా? అయితే కంగారు ఎందుకు మేమున్నాము కదా.. ఈ స్టోరీలో ఆంధ్రా స్టైల్ గుత్తి వంకాయ పులుసు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది వివరించాము. పూర్తిగా చదివి మీరూ కూడా ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు:
వంకాయలు - ½ కిలో
ఉప్పు, కారం - రుచికి తగినంత
జీలకర్ర - 1 టీస్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
మెంతులు - ½ టీస్పూన్
చింతపండు - ఒక నిమ్మకాయ పరిమాణంలో
తరిగిన ఎండుకొబ్బరి ముక్కలు - ¼ కప్పు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - ½ టీస్పూన్
పసుపు - ½ టీస్పూన్
టమాటాలు - 2 (చిన్న ముక్కలుగా కోసినవి)
కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:
వంకాయల ప్రిపరేషన్:
వంకాయలను శుభ్రంగా కడిగి మధ్యలో నాలుగు చీల్చులు పెట్టాలి. ఈ ముక్కలను ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టాలి.
చింతపండు రసం సిద్ధం చేయడం:
చింతపండును 15 నిమిషాలు నీటిలో నానబెట్టి, తరువాత దానిని రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
మసాలా తయారీ:
పాన్ పెట్టి జీలకర్ర, మెంతులు నెమ్మదిగా వేయించాలి. తరువాత ధనియాలు వేసి అరగంట వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో ఎండుకొబ్బరి ముక్కలు బంగారు రంగు వచ్చే వరకు వేయించి చల్లారనివ్వాలి. ఈ వేయించిన దినుసులను మిక్సీలో వేసి కొద్దిగా నీరు కలిపి మృదువైన పేస్ట్‌గా చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా జత చేయవచ్చు.
కూర ప్రిపరేషన్:
కుక్కర్లో ఆయిల్ వేడిచేసి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి కొన్ని నిమిషాలు మంట తగ్గించి వేయించాలి. తర్వాత వంకాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. పసుపు, ఉప్పు, కారం, టమాట ముక్కలు జత చేసి మళ్ళీ కలిపి 5 నిమిషాల పాటు మూతపెట్టి ఉడికించాలి.
చివరి దశ:
ఇప్పుడు చింతపండు రసం వేసి మళ్లీ కలిపి, రుచిని సర్దుకోవాలి.
కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై రెండు విజిల్స్ వచ్చే వరకు
ఉడికించాలి.
ఆవిరి తగ్గిన తర్వాత, వేడి వేడి గుత్తి వంకాయ పులుసు రెడీ! దీనిని
వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, నా సామిరంగా అనాల్సిందే.
అమోఘమైన రుచి, అద్భుతమైన ఆహరం అవుతుంది.
సూచన:
ఈ పులుసు స్పైసీగా, పుల్లగా ఉండి అన్నంలోకి, జీరా రైస్‌లోకి అదిరిపోతుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి!
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications