Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కేరళ స్టైల్‌లో ఉన్నియప్పంను ఇలా చేసుకోండి.. రుచి, పోషకాలు, చిటికెలో రెడీ..!
కేరళలో ఉన్నియప్పం చాలా ఫేమస్. ఇది కేరళ ప్రత్యేక వంటకం. మనకు కాకినాడ కాజా ఎలాగే కేరళలో అలాంటి ప్రత్యేకమైన స్వీట్లలో ఈ ఉన్నయప్పం కూడా ఒకటి. కొవ్వు పదార్ధాలు లేకపోవడం ఈ స్వీట్ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. ఓనమ్ పండగలో కూడా ఈ ఉన్నియప్పంను ప్రత్యేకంగా చేసుకుంటారు. కొన్ని గుళ్లల్లో ఈ ఉన్నియప్పంను ప్రసాదంగా కూడా ఇస్తారు. మళాయలంలో ఉన్ని అంటే చిన్న, అప్పం అంటే రైస్ కేక్ అని అర్థిం. అంటే ఉన్నియప్పం అనగానే చిన్న రైస్ కేక్‌గా మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ ఉన్నియప్పంను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
ఉన్నియప్పం తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి ఇవే :
పావు కేజీ బెల్లం
1 కప్పు బియ్యం పిండి
పావు కప్పు గోదుమ పిండి
2 టేబుల్ స్పూన్ల బొంబాయ్ రవ్వ
చిటికెడు ఉప్పు
అర టీస్పూన్ జిలుకర పొడి
ఒకటిన్నర స్పూన్ ఇలాచీ పౌడర్
1 టీస్పూన్ నువ్వులు
ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బర
చిటికెడు వంట సోడా
కేరళ స్టైల్‌లో ఉన్నియప్పంను ఈ కింది విధంగా తయారు చేసుకుందాం :
1. ముందుగా బౌల్‌లో పావు కేజీ బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లంలో 250 మిల్లీలీటర్ల నీల్లు పోసుకొని బాగా కడగాలి. ఇలా కడగడం వల్ల బెల్లంలో వున్న మట్టి, నార అన్నీ తొలగిపోతాయ్. దీన్ని స్టవ్ పైన చిన్న ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి.
2. మరో బౌల్‌లో 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. పావు కప్పు గోదుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. గోదుమ పిండికి బదులుగా మైదా పిండిి కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బొంబాయ్ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి.
3. చిటికెడు ఉప్పు, అర టీస్పూన్ జిలుకర పొడిని కూడా వేసుకోవాలి. ఒకటిన్నర స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీస్పూన్ నువ్వులను వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరను కూడా వేసుకోవాలి. చిటికెడు వంట సోడా కూడా వేసుకొని మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి.
4. ఇంతకు ముందు స్టవ్ మీద పెట్టిన బెల్లం మొత్తం నీళ్లల్లోకి కరిగిపోయి వుంటుంది. పక్కకు బౌల్‌లో పెట్టుకున్నపిండిలోకి నాలు టేబుల్ స్పూన్ల బెల్లం పానకం వేసుకోవాలి. పిండిని ఒక సారి కలిపి, ఇప్పుడు బెల్లం పానకాన్ని ఒక గ్లాసులో వడకట్టాలి.
5. పిండిలో బెల్లం పానకం కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. సరిపోకపోతే కొన్ని నీళ్లను యాడ్ చేసుకొని కలుపుకుంటూ వుండాలి. మరీ పలుచగా, మరీ గట్టిగా కాకుండా కొంచెం థిక్‌గా కలపాలి.
6. ఇప్పుడు గుంత పొంగనాలు చేసే ప్యాన్ తీసుకొని అందులో అన్ని గుంతల్లో నీళ్లు మొత్తం నిండేవిధంగా పోసుకోవాలి. ఆ గుంతల్లో ముప్పావు భాగమంత కలిపిన పిండిన గరిటెతో పోసుకోవాలి. ఈ ప్యాన్‌ను మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టాలి. ఇప్పుడు రెండు వైపులా ఈ పొంగనాలు ఫ్రై అయ్యే విధంగా చూసుకొని తరువాత వాటిని ఒక జాలి గంటెలో తీసుకోవాలి. ఫ్రై అయిన వాటిని రెండు నుంచి 3 గంటలు బయట పెట్టడం ద్వారా కొంచెం గట్టిగా క్రిస్పీగా టేస్టీగా అవుతాయ్.
7. ఇత దీంతో కేరళ స్టైల్ ఉన్నియప్పం రెడీ అయినట్టే. ఈ ఉన్నియప్పంతో రుచి మాత్రమే కాదు శరీరానికి మంచి పోషకాలు కూడా అందుతాయ్. ఎందుకంటే ఇందులో బెల్లం, పిండి, స్పైసెస్ వాసాము కాబట్టి ప్రొటీన్‌తో పాటు కొన్ని పోషకఖనిజాలు కూడా మనకు అందుతాయ్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












