Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.!
వెజ్, నాన్‌వెజ్ అనే తేడా లేకుండా పనీర్ కర్రీ అంటే ఇష్టపడని వారుండరు. పనీర్ బటర్ మసాలా, పనీర్ టిక్కా, పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా చాలా రకాల వెరైటీలను రుచిచూసుంటారు. మెయిన్‌గా రోటీ- పనీర్ కాంబినేషన్ ఎవర్గ్రీన్. అయితే పనీర్‌తో కాలీఫ్లవర్ కలిపి వండితే ఇక నాన్‌వెజ్ కూడా పక్కనపెట్టేస్తారు. ఆ క్రేజీ కాంబినేషన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం..

పనీర్- కాలీఫ్లవర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు
పనీర్- 100 గ్రాములు
కాలీఫ్లవర్- ఒకటి మీడియం సైజ్
క్యారెట్- రెండు
బీన్స్- 100 గ్రాములు
ధనియాలు- రెండు టీ స్పూన్లు
మసాలా దినుసులు- ఒక టీస్పూను
ఎండుమిర్చి- 5
ఎండు కొబ్బరి- ఒక కప్పు
ఉల్లిగడ్డ- ఒకటి
టమాటా- రెండు
కారం- టీస్పూన్
పసుపు- చిటికెడు
ఉప్పు- తగినంత
కొత్తిమీర- కొద్దిగా
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్- టీ స్పూన్
పనీర్- కాలీఫ్లవర్ కుర్మా తయారీ విధానం
ముందుగా కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్‌ను ముక్కలుగా చేసుకుని కట్ చేసుకోవాలి. వాటిని ఓ గిన్నెలో నీళ్లు పోసి ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు పనీర్‌ను చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకుని బాణలిలో కొంచెం నెయ్యి వేసి రంగు మారే వరకు వేగనివ్వాలి. అందులోనే ఉడికించిన కూరగాయల ముక్కలను వేసి కాసేపు వేయించాలి. తర్వాత వాటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ధనియాలు, మసాలా దినుసులు, ఎండు కొబ్బరి, ఎండు మిర్చి కాసేపు వేయించి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయలు ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దోరగా వేగాక రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. అందులోనే కారం, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలాక పనీర్, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ ముక్కలను వేసి కలిసి ఓ పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కాసేపయ్యాక కొన్ని నీళ్లు పోసి నూనె పైకి తీలేవరకు ఉడికించుకుని చివరిగా కొత్తిమీర చల్లుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే లంచ్ లేదా డిన్నర్‌లోకి అదిరిపోయే డిష్ రెడీ..
పనీర్- కాలీఫ్లవర్ కాంబినేషన్‌తో చేసే కుర్మాని వెజ్ కొల్లాపురి అని పిలుస్తారు. కాలీఫ్లవర్‌తో ఎప్పుడూ గోబీ మంచూరియా, ఫ్రై అంటూ రొటీన్ డిషెస్ చేసి విసిగిన వారు ఈ సారి పనీర్‌తో కలిపి కుర్మా ట్రై చేయండి. మసాలా ఘాటుతో స్పైసీగా పులావ్, చపాతీ, పూరీ, పరాటాలోకి రుచి అదిరిపోతుంది.
శరీరానికి తక్షణ శక్తి
ఈ కుర్మాలో ప్రధానంగా వినియోగించే పనీర్, కాలీఫ్లవర్, బీన్స్ పదార్థాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మొత్తం 150 గ్రాముల కాంబినేషన్ ద్వారా దాదాపు 220 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. అత్యధికంగా 12 గ్రాముల ప్రొటీన్ మన శరీరానికి చేరుతుంది. తద్వారా శరీరానికి తక్షణ శక్తి అందడమే కాకుండా కండరాల బలానికి దోహదపడుతుంది. ఇందులో కార్బొహైడ్రేట్లు(8 గ్రాములు) తక్కువ మొత్తంలో ఉండటం ద్వారా షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. 12- 14 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వుల ద్వారా హార్మోన్లను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. 5 గ్రాముల ఫైబర్ లభ్యమవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications