Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఓవెన్ లేకుండా ఇంట్లోనే బిస్కెట్లు ఇలా చేసుకోవచ్చు..! బిస్కెట్లపై బ్రాండ్ మనదే..!
బిస్కెట్లను కొనుక్కొని తినడమే కానీ ఇంట్లో తయారు చేసుకునేవారు చాలా తక్కువ. కొందరు కేక్ అయినా తయారు చేసుకుంటారు గానీ బిస్కెట్లను తయారు చేసుకునేవారు చాలా అరుదు. కానీ ఇంట్లోనే సులభంగా గోదుమ బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఓవెన్లు బేకింగ్ కుక్కర్లు అవసరం లేదు. గోదమ బిస్కెట్ల రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాం. ఈ వీకెండ్లో బిస్కెట్లను తయారు చేసుకొని మన సొంత బ్రాండ్‌ను బిస్కెట్‌పై ప్రింట్ చేద్దాం. ఏమంటారు. ఇక బెస్కెట్లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
బిస్కెట్లు తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
బెల్లం, చెక్కర, పాలు, బొంబాయ్ రవ్వ, బాదాం, కాజూ, కిస్మిస్, యాలాకులు, గోదుమ పిండి, ఉప్పు, మంచి నూనె.

బిస్కెట్లు తాయరు చేసే విధానం
ముందుగా ఒక బౌల్లో అరకప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం స్థానంలో చెక్కరనైనా తీసుకోవచ్చు. కానీ చెక్కరలో కంటే బెల్లంలో పోషకాలు మెండుగా వుంటాయ్. కాబట్టి సాధ్యమైనంత వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇందులోనే వేడి చేసి చల్లార్చిన పావు కప్పు పాలను యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ గ్రైండర్లో అరకప్పు బొంబాయ్ రవ్వను తీసుకోవాలి. 4 బాదాంలను, 4 కాజూలను మిక్సీ గ్రైండర్‌లోకి వేసుకోవాలి. రెండు యాలాకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతకు ముందు బెల్లం,పాలు కలిపిన బౌల్‌ను తీసుకొని అందులో వున్న బెల్లం పానకాన్ని వడకట్టాలి.
వేరే బౌల్లోకి ఒక కప్పు గోదుమ పిండిని తీసుకోవాలి. ఇందులోనే ఇంతకు మందు గ్రైండ్ చేసిన బొంబాయ్ రవ్వను యాడ్ చేసుకోవాలి. రుచి కోసం చిటికెడంత ఉప్పును, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం పిండిని కలుపుకోవాలి. చేతిలోకి పిండి తీసుకుంటే ఒక ముద్దలా రావాలి. అలా వస్తే బిస్కెట్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు.

ఈ పిండిలో బెల్లంపాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిను బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ చేయడానికి పిండిని ఎలాగైతే కలుపుతామో, ఈ పిండిని కూడా అలాగే కలపాలి. చపాతీ చేసుకునే ముందు పిండి ముద్దను ఎలాగైతే రెడీ చేసుకుంటామో ఈ పిండిని కూడా అలాగే రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక పెద్ద పిండి ముద్దను తీసుకొని బిస్కెట్లు రావడానికి వీలుగా మందంగా రొట్టెను రోల్ చేసుకున్నట్లు రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద చపాతీలాగా రోల్ చేసుకున్న తరువాత బిస్కెట్ల షేపు రావడానికి చిన్న గ్లాసును తీసుకొని బిస్కెట్ల ఆకారం వచ్చే విధంగా ఆ చపాతీ పిండిపై ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఒక చపాతీలో మూడు బిస్కెట్లు వచ్చే అవకాశం వుంటుంది.
ఇలా కట్ చేసుకున్న బిస్కెట్లపై ఫోర్క్ సాయంతో ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన బిస్కెట్లను ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
కట్ చేసిన బిస్కెట్లను ఫ్రై చేయడానికి ఒక ప్యాన్‌లో తగినంత ఆయిల్‌ను పోసుకోవాలి. నూనె కొద్దిగా వేడయిన తరువాత బిస్కెట్లను ఆయిల్లో వేయాలి. బజ్జీలు తిప్పినట్లు బిస్కెట్లను ప్యాన్‌లో తిప్పవద్దు లేదంటే విరిగిపోతాయ్. చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బిస్కెట్లను ఫ్రై చేసుకోవాలి.
స్పూన్ సాయంతో బిస్కెట్లను నెమ్మదిగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతా బిస్కెట్లన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెడితే బిస్కెట్లు మాడిపోతాయ్. కాబట్టి మంటను లో ఫ్లేమ్, అవసరమైతే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications