Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షుగర్ రాకుండా ఉండాలంటే ఈ ఇడ్లీలు తినాలి, చాలా హెల్తీ గురూ! ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
కరోనా తరువాత చాలా మందిలో ఆరోగ్యంపై ద్రుష్టి పెరిగింది. చాలా మంది ఆరోగ్యకరమైన జీవన విధానం పొందాలని ఆ వైపుకు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకుంటున్నారు. డైట్ పాటించడం, క్యాలరీలను బట్టి తినడం, వర్కౌట్స్ చేయడం వంటివి చేస్తున్నారు. ఉదయాన్నే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ తింటుంటారు. బ్రేక్ ఫాస్ట్‌లో అందరూ ఇష్టంగా తినేది ఇడ్లీ. ఇది లైట్‌గా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే సాధారణ ఇడ్లి కాకుండా.. జొన్న ఇడ్లీలు తింటున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేసుకోవడం కూడా అత్యంత సులభం. ఈ స్టోరీలో ఈ జొన్న ఇడ్లీలు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
జొన్న రవ్వ - 3 కప్పులు
మినప్పప్పు - 1 కప్పు
నీరు - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - అవసరం మేరకు

తయారీ విధానం:
ఈ జొన్న ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా మినపప్పును శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత ఆ పప్పును సుమారు 6 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అలాగే జొన్న రవ్వను కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. దానిని కూడ ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఇప్పుడు ముందుగా ఆరు గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పిండిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో జొన్న రవ్వ కూడా వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం దానిని కూడా ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న మినపప్పు, జొన్న రవ్వలో తగినంత ఉప్పు బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి రాత్రంతా పులియనివ్వాలి.
ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. అందులో నీళ్లు పోసి బాగా వేడి చేసుకోవాలి. ఆ తరువాత ఇడ్లీ ప్లాట్లకు నూనె లేదా వీలుంటే నెయ్యి రాసుకొని అందులో బాగా పులిసిన పిండిని ఓసారి కలుపుకొని పిండి వేసుకోవాలి. ఆ తరువాత ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లను పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే ఎంతో సులభమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న ఇడ్లీ సిద్ధమైనట్లే. దీనిని కొబ్బరి చట్నీ లేదా పాళీ చట్నీతో తింటే ఆ రుచి అమోఘంగా ఉంటుంది.
జొన్న ఇడ్లీ ఆరోగ్య ప్రయోజనాలు:
జొన్న ఇడ్లీలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో అంతే ఆరోగ్యంగా కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ ఉన్న వ్యక్తులు దీనిని తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే అనేక ఉపయోగాలు ఇందులో నిండి ఉన్నాయి. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఇచ్చాము..
జొన్నలలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు
పుష్కలంగా ఉంటాయి.
జొన్నలు గ్లూటెన్ రహితమైనవి, కాబట్టి గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు కూడా
వీటిని తినవచ్చు.
జొన్నలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.
జొన్నలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
జొన్నలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
జొన్నలు గుండె ఆరోగ్యానికి మంచివి.
జొన్నలు శరీరానికి శక్తిని అందిస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications