Latest Updates
-
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..!
నూనె లేకుండా ఆరోగ్యకరమైన పూరీలు.. ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?
పూరీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఉదయాన్నే టిఫిన్ చేసేటప్పుడు చాలా మంది పూరీలు తినడానికి ఇష్టపడుతుంటారు. అంత రుచిగా ఉండే ఈ పూరీలను బరువు తగ్గాలనుకునే వ్యక్తులు, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు మాత్రం తినలేరు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా నూనె ఉండడంతో పాటు ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి. దీని కారణంగా బరువు తగ్గాలనుకునే వ్యక్తులు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వారికి తినాలని ఉన్నా తినలేరు.
అలాంటి వారికోసం ప్రస్తుతం మార్కెట్లోకి నూనె లేని పూరీలు వచ్చేశాయి. ప్రస్తుతం ట్రేడింగ్‌లో ఉన్న ఈ ప్రాసెస్‌ను ఎలా చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధమైన పద్దతిలో నూనె లేకుండా పూరీలు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం.

నూనె లేకుండా పూరీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు గోధుమ పిండి
- రెండు టేబుల్ స్పూన్ల పెరుగు
- రుచికి తగినంత ఉప్పు
- పిండి కలుపుకునేందుకు సరిపడా నీళ్లు
- ఎయిర్ ఫ్రయర్(ఇది తప్పనిసరి)
నూనె లేకుండా పూరీలు తయారు చేసుకునే విధానం
- ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గోధుమ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా సాగే విధంగా ఒత్తుతూ మెత్తగా కలుపుకోవాలి.
- పిండిని బాగా కలుపుకున్నాక.. ఆ పిండిపై ఒక మూత పెట్టి, దానిని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయాలి. ఇలా పిండిని ఉంచితే పిండి కొంచెం పిలుస్తుంది. దీంతో పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఆ తరువాత ఆ ఉండలను కొంచెం మందంగానే సాగే విధంగా పూరీలుగా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పూరీలను చపాతీ కర్రతో ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చపాతీలో ఒత్తడానికి ముందే ఒక గిన్నెల్లో నీళ్లను ఉడకబెట్టుకోవాలి. ఆ నీటిలో మనం ఒత్తి పెట్టుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ.. ఒక్కో పూరీని రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి.
- రెండు నిమిషాల పాటు పూరీలన్నీ ఉడికిపోయాక వాటిని బయటికి తీసి.. వాటిపై ఉండే నీటిని మొత్తాన్ని తుడిచేయాలి. అనంతరం ఆ పూరీలను ఎయిర్ ఫ్రయర్లో వేసుకొని సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వద్ద హీట్ చేసుకోవాలి. ఒక అయిదు నిమిషాల పాటు పూరీలను ఎయిర్ ఫ్రయర్లో హీట్ చేసుకొని బయటికి తీసుకోవాలి.
- ఎయిర్ ఫ్రయర్లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పూరీలను పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక పూరిపై ఇంకో పూరి ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకదానిపై ఇంకోటి ఉంటే పూరీలు ఉబ్బకపోవడంతో పాటు, పూరీలు అనుకున్న విధంగా వచ్చే అవకాశం ఉండదు.
- ఇలా అన్ని పూరీలను ఎయిర్ ఫ్రయర్లో అయిదు నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే ఎలాంటి ఆయిల్ లేకుండా పూరీలను రెడీ చేసుకోవచ్చు. వాటిని ఒక ప్లేట్లో తీసుకొని వేడి వేడిగా కుర్మా లేదా చట్నీతో ఎంజాయ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications