Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
చికెన్‌ను మించిన EGG 65.. దాబా స్టైల్‌లో ఇంట్లో ఇలా సింపుల్‌గా చేసుకోండి
గుడ్డుతో ఎలాంటి వంటకం చేసినా అది రుచికరంగా ఉంటుంది. అలాగే గుడ్డుతో చేసే వంటలు తినడం కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది. గుడ్డు తినడం వల్ల రుచికరమైన ఆహరం మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైనది కూడా. గుడ్డు తినడం వల్ల శరీరానికి పోషకాలు దొరకడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇలాంటి కోడి గుడ్లతో ఎన్నో వంటలు కూడా చేస్తుంటారు. వాటిలో అత్యంత రుచికరమైన వంట ఒకటి ఉంది. అదే ఎగ్ 65.
ఈ ఎగ్ 65 చాలా రుచికరంగా ఉండడంతో పాటు సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని హోటళ్లు, ధాబాలో ఎక్కువగా చేస్తుంటారు. ఈ రెసిపీని ఇంట్లోనే మనం కూడా చేసుకోవచ్చు. సులభంగా ఈ ఎగ్ 65ని ఎలా చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా దీనిని చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు
- కోడిగుడ్లు
- కార్న్ ఫ్లోర్
- మైదాపిండి
- కారం
- పసుపు
- గరం మసాలా
- అల్లం వెల్లుల్లి పేస్ట్
- ఆయిల్
- రుచికి సరిపడా ఉప్పు
ఎగ్ 65 తయారీ విధానం
ఎగ్ 65 తయారు చేసుకోవడానికి ముందుగా మనం తీసుకున్న కోడి గుడ్లను ఉడకబెట్టుకోవాలి. కోడిగుడ్లు ఉడకబెట్టిన తరువాత పొట్టు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. అందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఎగ్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక గుడ్డు ముక్కలను మైదా పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకొని వేయించుకోవాలి. అన్ని గుడ్డు ముక్కలను ఇలానే ముంచి నీటిగా వేయించుకోవాలి. గుడ్డు ముక్క నాలుగు వైపులా వేగే వరకు.. గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే ఈ ఎగ్ 65 రుచికరంగా ఉండడంతో పాటు కారకరలాడుతుంది.
అలాగే అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిని వేడి చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని గుడ్డుపై పోసుకుంటే ఎగ్ 65 సిద్ధమైపోతుంది. వీటిని టమాటో సాస్, గ్రీన్ చట్నీ సహాయంతో తినొచ్చు. ఇది ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications