For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pongal Special Recipe : సంక్రాంతికి ఈ రెసిపీ చాలా స్పెషల్ అని మీకు తెలుసా...

సంక్రాంతి సమయంలో ఈ రెసిపీ చాలా స్పెషల్ అని తెలుసా...

|

మకర సంక్రాంతి పండుగ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఈ పండుగ సమయంలో కోళ్ల పందేలు, పతంగులు ఎగురవేయడం ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నదాత ఎంతో కష్టపడి వ్యవసాయం చేశాక ఫలితం వచ్చే సమయం కావడంతో సంక్రాంతి పండుగను తమ కుటుంబంతో సంతోషంగా జరుపుకుంటాడు.

Pongal recipe in Telugu

Image Credit to Insta

అందుకే ఈ పండుగను చాలా పెద్ద పండుగ అంటారు. ఈ ఫెస్టివల్ టైమ్ లో ఎన్నో రుచికరమైన వంటకాలను ఇళ్లలోనే చేసుకోవడం.. వాటిని చుట్టుపక్కల వారికి, బంధువులకు, స్నేహితులకు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలపడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తోంది. అయితే సంక్రాంతి పండుగ సమయంలో చేసే పిండి వంటల్లో ఎక్కువగా మురుకులు, అరిసెలు, బొబ్బట్లు, వంటివి ఎక్కువగా ఉంటాయి.

Pongal recipe in Telugu

Image Credit to Insta

అయితే తెలంగాణలో మాత్రం ఓ రెసిపీని చాలా ప్రత్యేకంగా చేస్తారు. దీనికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. అందరికీ నోరూరించే ఆ రెసిపీ 'సకినం'. ఈ ప్రాంతంలో దీనికి ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. అలాంటి వంటకాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

Makar Sankranti 2021 : ఈ సంక్రాంతికి మీ రాశిని బట్టి ఇవి దానం చేస్తే మంచి ఫలితం వస్తుందంట..!Makar Sankranti 2021 : ఈ సంక్రాంతికి మీ రాశిని బట్టి ఇవి దానం చేస్తే మంచి ఫలితం వస్తుందంట..!

సకినాలను కూడా..

సకినాలను కూడా..

సకినాలు కేవలం తెలంగాణ ప్రాంతానికే ఎందుకు పరిమితమయ్యాయనే వివరాలపై స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే వీటిని టేస్ట్ చేసేందుకు ప్రతి ఒక్కరూ తెగ ఆరాటపడుతూ ఉంటారు. వీటిని కూడా పిండి వంటలను ఎలా అయితే చేస్తారో అదే పద్ధతిలోనే చేస్తుంటారు. కాకపోతే ఇవి కొంచెం వెరైటీగా ఉండటతో ప్రతి ఒక్కరూ ఈ సమయంలో సకినం రుచి చూడాలనుకుంటారు.

సకినాల తయారీలో..

సకినాల తయారీలో..

సకినాల తయారీలో ముందుగా కొత్త బియ్యం లేదా పాత బియ్యాన్ని నీటిలో నానబెట్టాలి. వీటిని ఒక రాత్రి మొత్తం నానబెట్టొచ్చు లేదా కనీసం 5 గంటలైనా కచ్చితంగా నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యం పట్టించాలి. పిండిని కాస్త తడి ఆరేదాకా ఎండబెట్టాలి.

రుచికరంగా ఉండేందుకు..

రుచికరంగా ఉండేందుకు..

సకినాలను తడి పిండితోనే తయారు చేసేందుకు ప్రయత్నిస్తే అవి రుచికరంగా ఉండవు. అందుకే అవి రుచికరంగా ఉండవు. కాబట్టి ఆ పిండి ఆరిన తర్వాత, ఒక కేజీ పిండికి కొలతల ప్రకారం 100 గ్రాముల నువ్వులు, వాము 10 గ్రాములు, అలాగే తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.

మకర సంక్రాంతి 2021: ఈ పండుగ జరుపుకోవడానికి 5 కారణాలుమకర సంక్రాంతి 2021: ఈ పండుగ జరుపుకోవడానికి 5 కారణాలు

ఒక కాటన్ గుడ్డలో..

ఒక కాటన్ గుడ్డలో..

అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఏదైనా కాటన్ గుడ్డలో వేసుకుని దానిపైన ఈ పిండితో గుండ్రంగా చుడుతూ వచ్చేలా వేయాలి. ఆ ఆకారం వచ్చేలా సకినాలు పేర్చుకుంటూ వెళ్లాలి.

సకినం విరగకుండా..

సకినం విరగకుండా..

అయితే దీనికి కాటన్ బట్టలనే ఎందుకు వాడాలంటే, మీరు కలిపిన పిండిలో ఇంకాస్త తేమ శాతం ఎక్కువగా ఉంటే, దానిలోని నీటిని అది పీల్చుకుంటుంది. ఇక ప్రై చేయడానికి తీసే సమయంలో కాటన్ వస్త్రం సకినం విరగకుండా జాగ్రత్త పడాలి.

ఆయిల్ లో..

ఆయిల్ లో..

ఆ తర్వాత మెల్లగా ఒక్కో సక్కినాన్ని తీసుకుంటూ ఏదైనా వంట నూనెలో ఫ్రై చేసుకుంటే చాలు.. నోరూరించే సకినాలు రెడీ అయినట్టే. అయితే సకినాలను ప్రై చేసే సమయంలో కాస్త దోరగా వేయిస్తే మనకి గోల్డ్ కలర్లోకి వస్తుంది. సో చూశారు కదా.. తెలంగాణ స్పెషల్ సకినం రెసిపీ ఎలా తయారు చేయాలో.. మీరు కూడా ఓ సారి ట్రై చెయ్యండి.

English summary

Pongal recipe in Telugu

Here we taking about the pongal recipe in Telugu. Read on
Story first published:Friday, January 8, 2021, 15:13 [IST]
Desktop Bottom Promotion