For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉగాది వేళ.. ఈ రుచికరమైన వంటకాలను మీరూ ట్రై చేయండి...

|

తెలుగు రాష్ట్రాలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. వసంత రుతువులో ప్రారంభమయ్యే తెలుగు కొత్త సంవత్సరానికి ప్రారంభం ఛైత్ర మాసం.

ఈ పండుగను ఇతర రాష్ట్రాల్లో గుడిపడ్వా, యుగాది, పుతండు, బైసాఖీ, విజు పేర్లతో జరుపుకుంటారు. ఈ ఏడాది మనం శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ఉగాది అంటే మన తెలుగు వారందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి.

ఆ తర్వాత పంచాంగ శ్రవణం. కొత్త ఏడాది తొలి రోజునే ఈ ఏడాది మొత్తం ఎలా ఉంటుందో అని తెలుసుకోడానికి పంచాంగ శ్రవణం చేయించుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తోన్న సంప్రదాయం.

ఇక ఏడాదంతా షడ్రుచుల్లా అన్ని రకాల భావోద్వేగాలకు సిద్ధంగా ఉండాలని చెబుతూ.. ఉగాది పచ్చడి తీసుకోవడం కూడా అలవాటే. అయితే వీటితో పాటు బొబ్బట్లు, పులిహోర, కోసంబరితో పాటు మరికొన్ని వంటలు ఉగాది ప్రత్యేకమే. ఇంత ప్రత్యేకమైన రోజు.. మరిన్ని సంప్రదాయ వంటకాల రుచితో మీ కుటుంబసభ్యులను ఆనందపరచండి.. ఆ సంప్రదాయ వంటకాలేవీ.. వాటిని ఎలా తయారు చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ugadi 2021: ఉగాది పూజా విధానం.. పంచాంగ శ్రవణ శుభ సమయం..Ugadi 2021: ఉగాది పూజా విధానం.. పంచాంగ శ్రవణ శుభ సమయం..

ఉగాది పచ్చడి..

ఉగాది పచ్చడి..

ఉగాది పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

మామిడికాయ ముక్కలు-2 టేబుల్ స్పూన్లు

వేప పువ్వు - టేబుల్ స్పూన్

ఉప్పు - తగినంత

బెల్లం - 3 టేబుల్ స్పూన్లు

మిరియాల పొడి - తగినంత

నీళ్లు - ఒకటిన్నర కప్పు

చింతపండు - ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం..

తయారీ విధానం..

మొదటగా చింతపండును నీళ్లలో బాగా నానబెట్టాలి. దాంట్లో బెల్లం వేసి కరిగేవరకూ తిప్పాలి. తర్వాత దాంట్లో మామిడికాయ ముక్కలు, వేపపువ్వు, మిరియాలపొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. కావాలంటే అరటిపండు ముక్కలు, బఠానీలు, చెరుకుముక్కలు, జీడిపప్పు, కిస్ మిస్ వంటి వాటిని కూడా కలపొచ్చు. అంతే ఆ వెంటనే అన్ని రకాల రచులూ బ్యాలెన్స్ గా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా మన బాడీకి ఎంతో మేలు జరుగుతుంది.

బెల్లం పరమాన్నం..

బెల్లం పరమాన్నం..

ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు

పెసర పప్పు - పావు కప్పు

బియ్యం - అర కప్పు

పాలు - 4 కప్పులు

పొడి బెల్లం - పావు కిలో

జీడిపప్పు - 10

బాదం పప్పు - 10

కిస్ మిస్ - 10

నెయ్యి - 4 స్పూన్లు

నీరు - ఒక కప్పు

యాలకుల పొడి - 1 టీ స్పూన్

Ugadi 2021:ఉగాది రోజున చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసా...Ugadi 2021:ఉగాది రోజున చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసా...

తయారీ విధానం..

తయారీ విధానం..

ముందుగా బియ్యం, పెసర పప్పును 20 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత స్టౌ వెలిగించి, బెల్లం పొడి వేసి, సగం కప్పు నీళ్లు వేసి కరిగించాలి. తర్వాత అది పేస్టులా మారిన తర్వాత స్టౌ ఆపేయాలి. మరో పాత్ర తీసుకుని పాలు వేడి చేయాలి. ఆ పాలలో నానబెట్టిన బియ్యం, పెసరపప్పు వేసి బాగా కలపాలి. దీంట్లో సగం కప్పు నీరు పోసి 10 లేదా 15 నిమిషాల పాటు మీడియం మంట పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత మరో చిన్న పాత్రలో నెయ్యి వేడి చేసి, కిస్ మిస్ వేసి బంగారం రంగు వచ్చే వరకు వేడి చేయాలి. తర్వాత పాలలో ఉడికించిన బియ్యం, పప్పు మిశ్రమాన్ని కలపండి. దీంతో పాటే బెల్లం పేస్టులోకి యాలకుల పొడిని వేసి బాగా కలిపి మరో 10 నిమిషాలు ఉడికించాలి. అంతే బెల్లం పరమాన్నం వడ్డించడానికి సిద్ధమవ్వాలి.

పులి హోర..

పులి హోర..

మామిడికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు..

ఉడికించిన బియ్యం - 2 కప్పులు

మామిడికాయ తురుము - 3 టేబుల్ స్పూన్లు

కరివేపాకు - 2 రెబ్బలు

పచ్చిమిర్చి - మూడు

ఎండుమిర్చి - రెండు

ఉప్పు - తగినంత

పసుపు - కొద్దిగా

వేరుశనగ గింజలు - 3 టేబుల్ స్పూన్లు

శనగ పప్పు - 1 టేబుల్ స్పూన్

మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్

ఆవాలు - టీ స్పూన్

జీలకర - టీ స్పూన్

అల్లం ముక్క - కొద్దిగా

నూనె - 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం..

తయారీ విధానం..

ముందుగా ఒక పాత్రను తీసుకుని అందులో నూనె, వేరుశనగ గింజలు, పప్పులు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అనంతరం మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా వేగనిచ్చి ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి, ఉప్పును పక్కన బెట్టుకుని.. బాగా కలిపి, రుచికి సరిపడా ఉప్పు కలుపుకుంటే.. మీరు ఎదురుచూస్తున్న మామిడికాయ పులిహోర సిద్ధం. పులిహోర వల్ల అటు కార్పొహైడ్రెట్లతో పాటు ఇటు వేరుశనగ గింజలు, పప్పుల్లోని ప్రోటీన్లు కూడా మనకు లభిస్తాయి.

English summary

Traditional Ugadi Recipes in Telugu

Here we are talking about the traditional ugadi recipes in Telugu. Have a look
Story first published: Monday, April 12, 2021, 17:08 [IST]