Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
బయట కొనే పనిలేకుండా ఇంట్లోనే..హైదరాబాదీ స్టైల్ చికెన్ హలీమ్ చేసుకోండిలా!
రంజాన్ మాసం అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల ఉపవాస దీక్షలతో పాటు, ఆహార ప్రియులందరికీ ముందుగా గుర్తొచ్చేది హలీమ్. అందులోనూ హైదరాబాదీ హలీమ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాధారణంగా మటన్ తో హలీమ్ చేస్తారు, కానీ చికెన్ తో చేసే హలీమ్ కూడా అంతే అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.
మటన్ తినని వారు, లేదా తేలికగా జీర్ణమయ్యే ఆహారం కావాలనుకునే వారికి చికెన్ హలీమ్ బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా మటన్ తో పోలిస్తే చికెన్ హలీమ్ చాలా త్వరగా తయారవుతుంది. రంజాన్ పవిత్ర మాసంలో ఇంటి దగ్గరే అత్యంత రుచికరమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన హైదరాబాదీ స్టైల్ చికెన్ హలీమ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ - 500 గ్రాములు
గోధుమ రవ్వ- 1 కప్పు
శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మినపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ఎర్ర కందిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు
బాస్మతి బియ్యం - 1 టేబుల్ స్పూన్
లవంగాలు - 8
యాలకులు - 6
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
మిరియాలు - 1 టీస్పూన్
షాహీ జీరా - 1 టీస్పూన్
కబాబ్ చీని- అర టీస్పూన్
ఎండిన గులాబీ రేకులు - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - అర కప్పు
ఫ్రై చేసిన ఉల్లిపాయలు- 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 5
పుదీనా ఆకులు - అర కప్పు
కొత్తిమీర - అర కప్పు
పెరుగు - అర కప్పు
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మకాయలు - 2
వేయించిన జీడిపప్పు, బాదం - గార్నిష్ కోసం

తయారీ విధానం
-ముందుగా గోధుమ రవ్వ, శనగపప్పు, మినపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, బాస్మతి బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినంత నీరు పోసి కనీసం 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. రాత్రిపూట నానబెట్టుకున్నా ఇంకా మంచిది.
-ఒక చిన్న పాన్ తీసుకుని అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, షాహీ జీరా, కబాబ్ చీని, గులాబీ రేకులు వేసి సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మెత్తని పొడిలా (హలీమ్ మసాలా) చేసుకోవాలి.
-ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.
-ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను కుక్కర్ లో వేసి బాగా కలపాలి. అందులో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, సగం కప్పు వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర,ముందుగా తయారుచేసుకున్న హలీమ్ మసాలాలో సగం వేసి బాగా కలిపి ఒక గ్లాసు నీళ్లు పోసి, కుక్కర్ మూతపెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు లేదా చికెన్ చాలా మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి.
-ఉడికిన చికెన్ ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకుని, చల్లారిన తర్వాత వాటిని దారాలుగా విడదీసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ లో మిగిలిన నీటిని (చికెన్ స్టాక్) అలాగే ఉంచాలి.
-ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వ, పప్పుల మిశ్రమాన్ని ఒక కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత బ్లెండర్ లేదా మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చాగా (మరీ పేస్ట్ లా కాకుండా) గ్రైండ్ చేసుకోవాలి.
-ఒక పెద్ద మందపాటి గిన్నె (హండీ) తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. అందులో మిక్సీ పట్టుకున్న పప్పుల మిశ్రమం, విడదీసి పెట్టుకున్న చికెన్ ముక్కలు, కుక్కర్ లో మిగిలిన చికెన్ స్టాక్ వేసి బాగా కలపాలి. మంటను సిమ్ లో ఉంచి ఒక చెక్క పప్పుగుత్తితో ఈ మిశ్రమాన్ని నిరంతరంగా మెదపాలి.
-కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు ఇలా మెదుపుతూనే ఉండాలి. మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి, మిగిలిన హలీమ్ మసాలా, కొత్తిమీర, పుదీనా వేస్తూ కలుపుతూ ఉండాలి. చికెన్, గోధుమ రవ్వ మిశ్రమం పూర్తిగా కలిసిపోయి, ఒక జిగటగా మారాక స్టవ్ ఆపేయాలి.
-వేడి వేడి హలీమ్ ను ఒక బౌల్ లోకి తీసుకుని, పైన నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదం, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసంతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఎంతో రుచికరమైన హైదరాబాదీ చికెన్ హలీమ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications