Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
చార్మినార్ దాకా ఎందుకు? అసలైన హైదరాబాదీ మటన్ హలీమ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి చార్మినార్, బిర్యానీ, ఆ తర్వాత హలీమ్. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు, హైదరాబాద్ వీధులన్నీ హలీమ్ సువాసనలతో గుమగుమలాడిపోతాయి. రంజాన్ మాసంలోనే ప్రత్యేకంగా దొరికే ఈ హలీమ్ కోసం చాలామంది ఏడాదంతా ఎదురుచూస్తుంటారు.
హలీమ్ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఉపవాసం ఉండే వారికి తక్షణ శక్తిని ఇచ్చే అద్భుతమైన పోషకాల గని. ఇందులో వాడే ప్రతి పదార్థం శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. హలీమ్ ను ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
గోధుమ రవ్వ- 1 కప్పు
బార్లీ గింజలు - 1 టేబుల్ స్పూన్
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
పెసరపప్పు - 1 టేబుల్ స్పూన్
ఎర్ర కందిపప్పు - 1 టేబుల్ స్పూన్
బాస్మతి బియ్యం - 1 టేబుల్ స్పూన్
బోన్ లెస్ మటన్ - 500 గ్రాములు
మటన్ ఎముకలు - 200 గ్రాములు
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
లవంగాలు - 8
యాలకులు - 6
షాజీరా - 1 టీస్పూన్
కబాబ్ చిని - అర టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
ఎండిన గులాబీ రేకులు - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
పెరుగు - అర కప్పు
పచ్చిమిర్చి - 5
పుదీనా ఆకులు - 1 కప్పు
కొత్తిమీర - 1 కప్పు
స్వచ్ఛమైన నెయ్యి - 1 కప్పు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
నిమ్మకాయలు - 2
జీడిపప్పు, బాదం - గార్నిష్ కోసం

తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ రవ్వ, బార్లీ, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, బాస్మతి బియ్యం.. ఇవన్నీ ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి కనీసం 4 నుండి 5 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
-మిక్సీ గిన్నెలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, కబాబ్ చిని, మిరియాలు, గులాబీ రేకులు వేసి మెత్తటి పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, సగం వేయించిన ఉల్లిపాయలు (బిరిస్తా), పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి.
-ఇప్పుడు శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలు, ఎముకలు వేసి 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇందులో పసుపు, కారం, ఉప్పు, పెరుగు ముందుగా తయారు చేసుకున్న హలీమ్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. మటన్ మునిగేలా నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి 8-10 విజిల్స్ వచ్చే వరకు లేదా మటన్ చాలా మెత్తగా (చేత్తో పట్టుకుంటే విడిపోయేలా) ఉడికించాలి.
-నానబెట్టిన పప్పులు, రవ్వల మిశ్రమాన్ని తగినన్ని నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరో కుక్కర్ లో మెత్తగా ఉడికించుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి బరకగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ చేయకూడదు.
-ఉడికిన మటన్ నుండి ఎముకలను వేరు చేసి పడేయాలి. మిగిలిన మటన్ ముక్కలను, దానికి ఉన్న గ్రేవీని ఒక పెద్ద మందపాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉడికించి పేస్ట్ చేసుకున్న రవ్వ పప్పుల మిశ్రమాన్ని వేయాలి.
-ఇప్పుడు పప్పుగుత్తి తీసుకుని, మటన్ ముక్కలు దారాల్లా విడిపోయి, రవ్వ మిశ్రమంతో పూర్తిగా కలిసిపోయేలా మ్యాష్ చేయాలి. ఈ సమయంలో మంట తక్కువలో ఉండాలి. మధ్యమధ్యలో నెయ్యి, కొద్దిగా వేయించిన ఉల్లిపాయలు, పుదీనా వేస్తూ ఓపికగా మ్యాష్ చేయాలి. హలీమ్ సాగుతున్నట్లుగా (లేస్ గా) వచ్చే వరకు ఇలా చేయాలి.
-హలీమ్ తయారయ్యాక వేడివేడిగా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. పైన కరిగించిన స్వచ్ఛమైన నెయ్యి, కరకరలాడే వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నిమ్మరసం పిండుకుని తింటే... ఆ రుచికి మాటలు చాలవు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications